కాశీబుగ్గ మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల సాయం : లోకేశ్‌

 

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున సాయం అందిస్తామని మంత్రి లోకేశ్‌ ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులకు రూ.3 లక్షల ఇస్తామని తెలిపారు.వెంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటన ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. తీవ్రంగా గాయపడిన వారిని పలాస ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించిన వారికి భరోసా కల్పించారు. 94 ఏళ్ల వృద్ధుడు సొంత ఖర్చుతో వెంకటేశ్వరస్వామి దేవాలయం నిర్మించారు. ఇంత మంది భక్తులు వస్తారని ఎవరూ ఊహించలేదని తెలిపారు. 

బారికేడ్లు ఏర్పాటు చేసినా భక్తుల రద్దీ కారణంగా సరిపోలేదు. విషయం తెలిసిన వెంటనే మంత్రి, ఎమ్మెల్యే, అధికారులను అప్రమత్తం చేశాం. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం. తొక్కిసలాట ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారని లోకేశ్ తెలిపారు.  కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు, రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, అనిత, కొండపల్లి శ్రీనివాస్‌, స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష తదితరులు బాధితులను పరామర్శించిన వారిలో ఉన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu