Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కారుమూరి సునీల్‌కు 14 రోజుల రిమాండ్.. చంచల్‌గూడ జైలుకు తరలింపు
posted on: Jun 18, 2026 9:20PM

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో ప్రకంపనలు సృష్టించిన మద్యం రవాణా కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చేతిలో అరెస్టయిన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్‌కు హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. న్యాయమూర్తి ఆదేశాల అనంతరం అధికారులు ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు.
కోర్టు విచారణ సందర్భంగా ఈడీ తరఫు న్యాయవాది (పీపీ), సునీల్ తరఫు సీనియర్ లాయర్ అశోక్‌రెడ్డి మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. గత ప్రభుత్వంలో కారుమూరి నాగేశ్వరరావు పౌరసరఫరాల శాఖ మంత్రిగా కొనసాగిన సమయంలో, ఆయన అండదండలతోనే సునీల్ చక్రం తిప్పారని ఈడీ కోర్టుకు వెల్లడించింది. తండ్రి రాజకీయ పలుకుబడిని అడ్డం పెట్టుకుని మద్యం రవాణా కాంట్రాక్టులను దక్కించుకున్నారని, తద్వారా భారీగా అక్రమ ఆస్తులు కూడబెట్టారని దర్యాప్తు సంస్థ స్పష్టం చేసింది.
ఈ స్కామ్‌కు సంబంధించి సునీల్ కుటుంబ సభ్యుల మధ్య దాదాపు రూ.7 కోట్ల మేర అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లు ఈడీ ప్రాథమిక ఆధారాలు సేకరించింది. ప్రధానంగా సుదర్శన కన్‌స్ట్రక్షన్‌కు చెందిన సందీప్, ప్రతాప్‌రెడ్డి అనే వ్యక్తులకు ఈ లిక్కర్ రవాణా కాంట్రాక్టులు దక్కేలా సునీల్ తెరవెనుక రాజకీయం నడిపినట్లు అధికారులు నిర్ధారించారు. ఆ కాంట్రాక్టులు ఇప్పించినందుకు ప్రతిఫలంగా సునీల్ ఖాతాల్లోకి ఏకంగా రూ.28 కోట్ల ముడుపులు అందినట్లు కోర్టుకు నివేదించారు.
ఈ భారీ మద్యం రవాణా కుంభకోణం కారణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ.195 కోట్ల మేర భారీ నష్టం వాటిల్లిందని ఈడీ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఈ కేసులో ఇంకా లోతైన విచారణ సాగుతోందని, మరికొన్ని కీలక ఆధారాలను త్వరలోనే న్యాయస్థానం ముందు ఉంచుతామని పీపీ తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. సునీల్‌కు రెండు వారాల జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
వైకాపా హయాంలో జరిగిన పలు అక్రమాలపై ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలోనే ఈడీ రంగంలోకి దిగి వరుస అరెస్టులకు పాల్పడుతుండటం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. మాజీ మంత్రి కుమారుడి అరెస్ట్ పట్ల అధికార పక్షం స్పందిస్తూ.. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా చట్టం ముందు మోకరిల్లాల్సిందేనని వ్యాఖ్యానించగా, ప్రతిపక్ష వైసీపీ దీనిని రాజకీయ కక్షసాధింపు చర్యగా అభివర్ణిస్తోంది.
ఈ కేసులో ఈడీ మరింత మంది కీలక నేతలను, అధికారులను విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సునీల్ ఇచ్చిన సమాచారం ఆధారంగా మున్ముందు మరికొన్ని అరెస్టులు జరిగే అవకాశాలు కనిపిస్తుండటంతో, ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో ఏ మలుపు తిరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది.


.webp)



