తిరుమలలో వైభవంగా కార్తీక పౌర్ణమి గరుడసేవ

తిరుమలలో  కార్తీకపౌర్ణమి గరుడసేవ బుధవారం (నవంబర్ 5) రాత్రి వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామి  గరుడవాహనంపై  మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను క‌టాక్షించారు.

పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరిం చుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయన్నది భక్తుల విశ్వాసం. ఈ గరుడవాహన సేవలో  పెద్ద జీయర్ స్వామి,   చిన జీయర్ స్వామి, ఆలయ పేష్కార్  రామకృష్ణ ఇతర అధికారులు పాల్గొన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu