కృష్ణమ్మకు కార్తీక హారతి

 ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో కార్తిక మాసోత్సవాలు అంగరంగ వైభవంగా, కన్నుల పండువగా జరుగుతున్నాయి. వైభవంగా జరుగుతున్నాయి. శ్రీశైల క్షేత్రంలో గత నెల  22 నుంచి ప్రారంభమైన కార్తిక మాసోత్సవాలు ఈ నెల  21వ తేదీ వరకు జరుగుతాయి.  

కార్తీకమాసం రెండవ శుక్రవారం (అక్టోబర్ 31) సందర్భంగా ఆ రోజు సాయంత్రం పాతాళగంగ వద్ద  కృష్ణమ్మ హారతి కార్యక్రమం పండితుల వేద మంత్రోచ్ఛారణల  మధ్య వైభవంగా జరిగింది. పాతాళగంగ వద్ద ఉన్న కృష్ణమ్మతల్లి విగ్రహానికి పూజాదికాలు, వస్త్ర సమర్పణ తదితర కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం పాతాళగంగ ఘాట్ వద్ద నీటిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై శ్రీస్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు విశేషపూజాదికాలు, దశహారతులు నదీమతల్లికి సారెను ఆలయ అధికారులు సమర్పించారు.

నదీమతల్లికి ఏకహారతి, నేత్రహారతి, బిల్వహారతి,నాగహారతి, పంచహారతి, సద్యోజాతాది పంచ హారతులు, కుంభహారతి, నక్షత్రహారతి, రథహారతి, కర్పూరహారతులు ఇచ్చారు. లోకకల్యాణార్థమై ప్రతీ సంవత్సరం కార్తికమాసంలో నదీమతల్లికి హారతులను సమర్పించడం జరుగుతోందని దేవస్థానం ఈవో   తెలిపారు. కన్నుల పండుగగా జరిగిన ఈ కార్యక్రమాన్ని యాత్రికులు ఎంతో భక్తితో వీక్షించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu