కర్నాటక వాసికి ఏకంగా 49 కోట్ల రూపాయల జాక్ పాట్
posted on: Feb 6, 2026 8:49AM

కర్నాటక వాసికి అనుకోని అదృష్టం కలిసొచ్చింది. అబుదాబిలో జరిగే బిగ్ టికెట్ లాటరీలో ఉడుపి జిల్లాలకు చెందిన 33 ఏళ్ల శాంతను షెట్టిగార్ జాక్ పాట్ కోట్టేశారు. లక్కీ డ్రాలో 20 మిలియన్ దిర్హామ్ లు అంటే భారత కరెన్సీలో దాదాపు 49 కోట్ల రూపాయలు గెలుచుకున్నాడు. కర్ణాటకకు చెందిన ప్రవాస భారతీయుడు శాంతన్ షెట్టిగార్ మస్కట్ లో రిటైల్ రంగంలో పని చేస్తున్నారు.
అబుదాబిలోని బిగ్ టికెట్ రాఫెల్ డ్రాలో అతడికి 49 కోట్ల రూపాయల భారీ ప్రైజ్ లభించింది. మంగళవారం ఆన్ లైన్ లో ఈ లాటరీ ఫలితాలు వెల్లడయ్యాయి. ఉడుపి జిల్లాలోని ఉద్యవర్‌కు చెందిన 33 ఏళ్ల శాంతను షెట్టిగర్.. ఈ వా డ్రాలో జాక్ పాట్ ను దక్కించుకున్నారు. ఒమన్‌లోని మస్కట్‌లో రిటైల్ రంగంలో పనిచేస్తున్న షెట్టిగర్, ఈ టికెట్‌ను ఒక స్నేహితుడితో కలిసి కొనుగోలు చేశారు. బహుమతి ప్రకటించాక నిర్వాహకులతో మాట్లాడిన షెట్టిగర్, ఈ అనుకోని విజయం పట్ల ఆశ్చర్యం, సంతోషం వ్యక్తం చేశారు. ప్రణాళిక ప్రకారం గెలుచుకున్న మొత్తాన్ని తన టికెట్ భాగస్వామితో పంచుకుంటానని తెలిపారు.


.webp)



