కర్ణాటక కొత్త సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం

posted on: Jun 3, 2026 4:55PM

 

కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ బాధ్యతలు చేపట్టారు. గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు.  సీఎం డీకే వెంట మొత్తం 13 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ  కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, సీఎం వీడి సతీషన్, తదితరులు హాజరయ్యారు. సిద్దరామయ్య  కుమారుడు యతీంద్ర సిద్ధరామయ్య, మల్లికార్జున్ ఖర్గే, కొడుకు ప్రియాంక్‌కు క్యాబినేట్‌లో చోటు కల్పించారు.  

కాగా, మే 2023లో కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు, ముఖ్యమంత్రి పదవి కోసం గట్టి పోటీ నెలకొంది. ఆ సమయంలో అధిష్టానం కుదిర్చిన అధికార భాగస్వామ్య ఒప్పందం ప్రకారం ఐదేళ్ల పదవీ కాలాన్ని సిద్ధరామయ్య, డీకే శివకుమార్ చెరిసగం పంచుకోవాల్సి ఉంది. అందులో భాగంగానే ఇప్పుడు సిద్ధరామయ్య స్థానంలో డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. 
 

google-ad-img
    Related Sigment News
    • Loading...