జేడీఎస్ కింగ్ మేకర్ అవ్వనుందా..?

 

కర్ణాటక ఎన్నికలు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఇక ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు గెలుపు ఎవరిదో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఒక్క ఆ రెండు పార్టీలు మాత్రమే కాదు.. దేశ వ్యాప్తంగా ఉన్న పార్టీలు.. సామాన్య ప్రజల చూపు కూడా ఇప్పుడు కర్ణాటక ఎన్నికల ఫలితాలపై పడింది. ఇక ఈ ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఈ రోజు ఉదయం మొదలైన కౌంటింగ్ క్షణ క్షణానికి తారుమారు అవుతున్నాయి. కౌంటింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే బీజేపీదే హవా అన్నటాక్ వచ్చేసింది. అన్ని చోట్ల దాదాపు బేజీపీనే ఆధిక్యంలో ఉంది. దాంతో బీజేపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు అప్పుడే. అయితే క్రమ క్రమంగా కాంగ్రెస్ పుంజుకుంటోంది. బీజేపీ ఆధిక్యత చిన్నచిన్నగా తగ్గుతోంది. 222 స్థానాలకు ఎన్నికలు జరుగగా, 112 స్థానాల్లో గెలిస్తే అధికారం ఖాయమవుతుంది. ఈ నేపథ్యంలో ఒకానొక దశలో 118 స్థానాల్లో ఆధిక్యాన్ని చూపిన బీజేపీ ఇప్పుడు చాలా స్థానాల్లో ఆధిక్యాన్ని కోల్పోయింది. ఇక ఇవే ఫలితాలు కనుక చివరి వరకూ కొనసాగితే మాత్రం హంగ్ ఏర్పడక తప్పదు. అలా ఏర్పడితే కనుక జేడీఎస్ కింగ్ మేకర్ గా మారాల్సిందే. మరి ఒకవేళ హంగ్ కునుక వస్తే తమ మద్దతు కాంగ్రెస్ కే ఇస్తామని ఇప్పటికే జేడీఎస్ అధికార ప్రతినిధి డానిష్ అలీ స్పష్టం చేశారు.  కాంగ్రెస్ కనుక ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్లు గెలవకుంటే తమ మద్దతు ఆ పార్టీకేనని.. మేం కాంగ్రెస్‌తోనే వెళ్తాం. అది మా బాధ్యత కూడా.. బీజేపీతో మేం వెళ్లే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశారు.

 

ఇదిలా ఉండగా.. ఇప్పుడు మరో అంశం కూడా తెరపైకి వస్తుంది. గతంలో గోవా, మణిపూర్ ఎన్నికల సమయంలో బీజేపీ... ఫిరాయింపుదారులను ప్రోత్సహించి, ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తమవైపు లాక్కుని  లో అధికారానికి దగ్గరైనట్టే, కర్ణాటకలోనూ ఓ ఐదారుగురు ఇతర పార్టీల ఎమ్మెల్యేలతో బీజేపీ బేరసారాలు చేయవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో.. బేడీఏస్ కింగ్ మేకర్ గా మారుతుందో..? లేదో..? ఏ జరుగుతుందో తెలుసుకోవాలంటే ఫలితాలు ఆఖరి వరకూ ఆగాల్సిందే.