కరీంనగర్ మేయర్ పీఠం గెలుచుకుంటాం : మంత్రి పొన్నం

posted on: Feb 15, 2026 12:57PM

 

కరీంనగర్ మేయర్ పీఠంపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 60 సీట్లు ఉన్నాయి.. 28 సీట్లతో బీజేపీ ఉంది.. అక్కడ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ మెజారిటీ లేదని ప్రతిపక్షం లో కూర్చుంటామని అన్నారు. కానీ కరీంనగర్ 69 స్ధానాలకు కేవలం 30 మాత్రమే ఉన్న బీజేపీకి నైతికత లేదని విమర్శించారు. 

బీజేపీయేతర కార్పొరేటర్లను ఏకం చేసి మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుంటామని మంత్రి పొన్నం ధీమా వ్యక్తం చేశారు. గెలిచిన కార్పొరేటర్ల అభిప్రాయం మేరకు ముందుకు సాగుతామని ఈనెల 16న స్పష్టత వస్తుందని పేర్కొన్నారు. ఉత్తర తెలంగాణ లో కరీంనగర్ ను  అభివృద్ధి చేయాలని మా ఆలోచన.. దానికి అనుగుణంగా మంచి పాలకవర్గం ఉంటే బాగుంటుందని ఆలోచనని పొన్నం తెలిపారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...