రైలు బాధితులకు బీమా ఊరట..
posted on: Nov 21, 2016 3:22PM
.jpg)
రైలు ప్రయాణం కోసం ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకున్న వారు 92 పైసలను అదనంగా చెల్లిస్తే, వారికి రూ. 10 లక్షల వరకు గరిష్ట బీమా కల్పిస్తామని గత బడ్జెట్ లో రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ బీమా వల్ల బాధిత కుటుంబాలకు లాభం చేకూరింది. పాట్నా-ఇండోర్ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పి ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోగా చాలా మంది ప్రయాణికులు గాయపడ్డారు. అయితే ఇప్పుడు ఈ పథకం ద్వారా.. ప్రమాదంలో ప్రాణాల కోల్పోయిన వారి కుటుంబీకులకు బీమా మొత్తాన్ని చెల్లించనున్నట్టు తెలుస్తోంది. ఆన్ లైన్లో టికెట్ బుక్ చేసేటప్పుడు... 92 పైసలను ప్రీమియం రూపంలో ఐఆర్సీటీసీకి చెల్లించాల్సి ఉంటుంది. 92 పైసలు చెల్లించిన ఏ తరగతి ప్రయాణికుడికైనా ఈ పథకం వర్తిస్తుంది. అయితే, సబర్బన్ రైళ్లకు మాత్రం ఈ పథకం వర్తించదు.



.jpg)






