Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...అనుపమ్ ఖేర్ భార్యకు, కన్నయా సంజాయిషీ
posted on: Apr 2, 2016 11:16AM
.jpg)
జేఎన్‌యూ వివాదాస్పద విద్యార్థి నేతలను అనుపమ్‌ఖేర్ దుమ్మెత్తిపోస్తున్న విషయం తెలిసిందే! అనుపమ్ ప్రభుత్వం తరఫున మాట్లాడుతున్నారనీ, అందుకే ఆయనకు పద్మ అవార్డు కూడా వచ్చిందని కొందరు విమర్శిస్తున్నారు కూడా. అనుపమ్ భార్య కిరొణ్ ఖేర్ భాజపా తరఫున పార్లమెంటు సభ్యురాలు కావడం వల్లే ఆయన భాజపాను వెనకేసుకు వస్తున్నారు అనేవారూ లేకపోలేదు. అయితే కిరొణ్ ఖేర్ ఇప్పటివరకూ జేఎన్‌యూ వివాదం మీద మౌనంగానే ఉన్నారు. కానీ ఎప్పుడైతే కన్నయా కుమార్, 1984లో జరిగిని సిక్కుల ఊచకోతని తక్కువచేసి మాట్లాడారో కిరొణ్ మండిపడ్డారు. ఆ మధ్య కన్నయా మాట్లాడుతూ 1984లో జరిగిన సిక్కుల ఊచకోతకి అల్లరిమూకలే కారణమనీ, కానీ 2002లో గుజరాత్‌లో జరిగిన అల్లర్లకి ప్రభుత్వం కారణమనీ చెప్పుకొచ్చారు.
దీని మీద స్పందిస్తూ సిక్కు వర్గానికే చెందిన కిరొణ్ ఖేర్, కన్నయా మీద ట్విట్టర్లో మండిపడ్డారు. కన్నయా మాటలు చాలా అమర్యాదకరంగా ఉన్నాయనీ, 1984 ఊచకోతలకి సంబంధించి చాలామంది కాంగ్రెస్ నేతలు బోనులో నిలబడ్డారని ఆమె పేర్కొన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి నీ మనసు చచ్చిపోయిందా అంటూ విమర్శించారు. కిరొణ్‌తో పాటు చాలామందే ఇలాంటి విమర్శలు చేయడంతో కన్నయా కాస్త దిగివచ్చారు. ‘తను పార్టీలకు అనుగుణంగా అభిప్రాయాలు వెల్లడించననీ, ఎక్కడ అన్యాయం జరిగినా గొంతెత్తుతానని’ సంజాయిషీ ఇచ్చుకున్నారు. పనిలో పనిగా ‘1984లో బీజేపీ నేతల మీద కూడా కేసులు నమోదయ్యాయి’ అని కొసరు విసిరారు. కన్నయా తీరు చూస్తుంటే కాంగ్రెస్‌ను సమర్థిస్తున్నట్లుగా ఉందని విమర్శకులు పేర్కొంటున్నారు.


.png)


