కల్వకుంట్ల కవిత అరెస్టు
posted on Nov 29, 2025 5:38AM
.webp)
తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవితను కామారెడ్డి పోలీసులు అరెస్టు చేశారు. బీసీలకు 42 శాతం డిమాండ్ తో కామారెడ్డిలో రైల్ రోకో చేపట్టిన కవితను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. కామారెడ్డి అశోక్ నగర్ రైల్వేగేట్ వద్ద బీసీల రిజర్వేషన్ల డిమాండ్ తో కవిత పట్టాలపై బైఠాయించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొనడమే కాకుండా భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.
దీంతో పోలీసులు రైల్ రోకో విరమించాలని కవితను కోరారు. ఆమె వినకపోవడంతో అదుపులోనికి తీసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో కవిత స్వల్పంగా గాయపడినట్లు సమాచారం. కాంగ్రెస్, బీజేపీలు బీసీ రిజర్వేషన్ల అమలును అడ్డుకుంటున్నాయని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసే వరకు పోరాటం ఆగదని కవిత ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కవిత సహా పలువురు జాగృతి నేతలను అదుపులోనికి తీసుకున్నారు.