Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కమల్‌నాథ్ నియామకం- కాంగ్రెస్ ఘోర తప్పిదం!
posted on: Jun 13, 2016 4:29PM

దేశంలో ఎక్కడైనా ఎన్నికలు జరుగుతున్నప్పుడు, అక్కడ తమ పార్టీని గెలిపించే బాధ్యతను సమర్థులకు అప్పగించడం పరిపాటి. కానీ కాంగ్రెస్ చేసిన ఓ నియామకం ఒకనాటి పాత గాయాలను రేపుతోంది. అసలుకే ఎసరు తెచ్చేలా ఉంది. వివరాల్లోకి వెళ్తే... త్వరలో పంజాబ్, హర్యానాలలో జరగనున్న ఎన్నికలలో తమ పార్టీని గెలిపించే బాధ్యతను కమల్‌నాథ్‌కు అప్పగించారు సోనియాగాంధి. ఇందులో ఆశ్చర్యం ఏముంది? కమల్‌నాథ్, గాంధి కుటుంబానికి సన్నిహితుడు కదా అనవచ్చు. కానీ అసలు మతలబు ఇక్కడే ఉంది. 1984లో ఇందిరాగాంధి హత్యకు బదులుగా, దిల్లీలో సిక్కులను ఊచకోత కోశారు. ఇందులో కొందరు కాంగ్రెస్ నేతలు కూడా పాలు పంచుకున్నారన్నది ఒక అభియోగం. సదరు కాంగ్రెస్ నేతలలో కమల్‌నాథ్ ముఖ్యులు. రాజకీయ కారణాలైతేనేం, న్యాయవ్యవస్థలో జాప్యం వల్లనైతేనేం, తగినన్ని సాక్ష్యాలు లేకపోవడం వల్లనైతేనేం... కమల్‌నాథ్ ఇప్పటికీ దోషిగా రుజువు కాలేదు. తనకు ఏ పాపం తెలియదనీ కమల్‌నాథ్ చెబుతున్నా, సిక్కుల మనసుల్లో ఆయన పట్ల అపనమ్మకం అలాగే ఉంది. అలాంటి కమల్‌నాథ్‌కి ఇప్పుడు పంజాబు వ్యవహారాలను అప్పగించింది కాంగ్రెస్. ఈ విషయమై ఇప్పటికే ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి.
పంజాబు ఎన్నికలలో తొలిసారి బరిలోకి దిగుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఈ విషయాన్ని చాలా తీవ్రంగా దుయ్యబడుతోంది. కాంగ్రెస్ తరఫున ముఖ్యమంత్రి అబ్యర్థిగా ఉన్న అమరేంద్ర సింగ్, ఈ విషయమై వివరణ ఇవ్వాలంటూ అరవింద్ కేజ్రీవాల్ ట్వీటారు. కమల్‌నాథ్‌కు పంజాబు పగ్గాలు అప్పగించడం అంటే పుండు మీద కారం చల్లడమే అని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. నిజానికి ఈసారి పంజాబులో జరగనున్న ఎన్నికలలో కాంగ్రెస్ ఎంతో కొంత పుంజుకుంటుందని ఆశించారు. 2012 ఎన్నికలలో 117 సీట్లకుగాను 42 సీట్లను గెల్చుకున్న కాంగ్రెస్ ఈసారైనా కావల్సిన సంఖ్యాబలాన్ని సాధిస్తుందని ఊహించారు. దానికి తోడు పంజాబులో మాదకద్రవ్యాల వినియోగం పెరిగిపోతోందంటూ వస్తున్న ‘ఉడతా పంజాబు’ సినిమాను కూడా తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలను మొదలుపెట్టారు. కానీ ఇంతలో కమల్‌నాథ్ నియామకంతో కాంగ్రెస్ తన విజయానికి తానే మోకాలడ్డినట్లు అయ్యింది.


.jpg)



