Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఉద్యమకారులు, గౌరవనీయులు, పెద్దలు కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు.. కల్వకుంట్ల కవిత
posted on: Feb 17, 2026 2:02PM

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదినం నేడు. ఆయన పుట్టిన రోజు సందర్భాన్నిపురస్కరించుకుని వివిధ పార్టీల అధినేతలూ, నేతలూ, బీఆర్ఎస్ నేతలు, పలువురు ప్రముఖులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, నేతలూ ఆయనకు సామాజిక మాధ్యమం ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అయితే కేసీఆర్ కుమార్తె, జనజాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత తన తండ్రి కేసీఆర్ కు సోషల్ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ పెట్టిన పోస్టు మాత్రం అందరి దృష్టినీ ఆకర్షించింది.
ఆమె కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఎక్స్ వేదికగా షేర్ చేసిన పోస్టులో ఉద్యమకారులు, గౌరవనీయులు, పెద్దలు కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు అని పేర్కొన్నారు. ఎక్కడా తండ్రి అని కానీ డాడీ అని కానీ సంబోధించలేదు. సింపుల్ గా, స్ట్రెయిట్ గా ఆమె కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన తీరు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది.
బీఆర్ఎస్ శ్రేణులైతే కవిత చేసిన ట్వీట్ పై విరుచుకుపడుతున్నారు. కవితకు తండ్రి పట్ల ప్రేమ, గౌరవం లేవని విమర్శిస్తున్నారు. ఆ ట్వీట్ లో ఎక్కడా కేసీఆర్ హోదా గురించి లేదు. కనీసం కేసీఆర్ ఫొటో కూడా లేకపోవడాన్ని బీఆర్ఎస్ శ్రేణులు ఎత్తి చూపుతూ విమర్శలు గుప్పిస్తున్నారు.


.webp)
.webp)


