Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఇది కేవలం ట్రైలర్ మాత్రమే...అసలు సినిమా ముందుంది : కవిత
posted on: Feb 14, 2026 2:53PM

సోషల్ మీడియాలో తనపై వస్తున్న విమర్శలు, ట్రోలింగ్‌పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తనదైన శైలిలో స్పందించారు. ఇది కేవలం ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా ముందుంది అంటూ ప్రత్యర్థులకు ట్రోలర్స్‌కు కవిత గట్టి వార్నింగ్ ఇచ్చింది. రాజకీయ దాడులకు భయపడేది లేదని భవిష్యత్తులో మరింత దూకుడుగా వ్యవహరిస్తామని కవిత స్ఫష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై కవిత సంతోషం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో తమ సంస్థ ఒక రాజకీయ పార్టీగా అవతరించబోతుందని ఇప్పటికే ప్రకటించామని కవిత తెలిపారు.
అధికారికంగా పార్టీని ప్రకటించే ముందు… మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని కార్యకర్తలు చివరి నిమిషంలో కోరారని చెప్పారు. వారి అభిలాష మేరకు తాము ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ గుర్తుపై ఎన్నికల బరిలోకి దిగినట్లు వెల్లడించారు. సొంత పార్టీ తరపున పోటీ చేయకపోయినప్పటికీ తెలంగాణ ప్రజలు మంచి ఫలితాలతో ఆదరించారని ఆమె అన్నారు.
ఎన్నికల్లో ఒక మున్సిపాలిటీని కైవసం చేసుకున్నామని, మరో మున్సిపాలిటీలో వైస్ చైర్మన్ పదవిని దక్కించుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. అదేవిధంగా… సుమారు 40 చోట్ల తమ కార్యకర్తలు గెలుపు అంచుల వరకు వెళ్లినట్లు కవిత తెలిపారు. ఈ ఎన్నికల ఫలితాలు తమ పార్టీ భవిష్యత్తుపై మరింత నమ్మకాన్ని కల్పించాయని కవిత తెలిపారు. అహంకారం లేని, పారదర్శక రాజకీయాలనే తాము లక్ష్యంగా పెట్టుకున్నామని… ప్రజలు తమను విశ్వసించారని చెప్పారు. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ప్రజల మద్దతు ఉంటుందని ఆమె తెలిపారు






