కాళోజీ హెల్త్ వర్సిటీ వీసీ రాజీనామా

కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ నందకుమార్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆయన గవర్నర్ కు పంపారు. కాళోజీ హెల్త్ వర్సిటీలో   జవాబు పత్రాల మూల్యాంకనణలో, ఇన్ చార్జీల నియామకాలలో పెద్ద ఎత్తున   అక్రమాలు జరిగినట్లు ఇటీవల ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విజిలెన్స్ అధికారులు సోదాలు సైతం చేపట్టారు.

అలాగే కాళోజీ హెల్త వర్సిటీ వ్యవహారాలపై   సీఎం రేవంత్ రెడ్డి  పేపర్ల మూల్యాంకనంలో అక్రమాలు, ఇష్టారీతిగా ఇన్‎ఛార్జీల నియామకాలపై  ఆరా తీశారు. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులను వివరణ కోరారు. వర్శిటీలో ఈ పరిస్థితులకు కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే ఇటువంటి చర్యల వెనుక  ఎంతటివారున్నా ఉపేక్షించేది లేదన్నారు. ఈ నేపథ్యంలోనే కాళోజీ వర్సిటీ వీసీ  డాక్టర్ నందకుమార్ తన పదవికి రాజీనామా చేశారు.   

Online Jyotish
Tone Academy
KidsOne Telugu