Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...గుజరాత్ అణువిద్యుత్ కేంద్రంలో ప్రమాదం
posted on: Mar 12, 2016 10:19AM
.jpg)
జపాన్‌లోని ఫుకుషిమా అణువిద్యుత్ కేంద్రంలో ప్రమాదం సంభవించి నేటికి సరిగ్గా ఐదు సంవత్సరాలు. సునామీ వల్ల దెబ్బతిన్న ఆ కేంద్రం నుంచి అణుధార్మిక శక్తి బయటకు వెలువడటం మొదలవడంతో, దాన్ని అదుపుచేసే వరకూ ప్రపంచం ఊపిరి బిగపెట్టుకుని చూసింది. ఇవాళ ఉదయం దినపత్రికలలో వచ్చిన మరో వార్త ఆనాటి భయానక పరిస్థితిని మళ్లీ గుర్తుకుతెచ్చింది. గుజరాత్‌లోని కక్రాపూర్‌లో ఉన్న అణువిద్యుత్ కేంద్రంలో నిన్న అనుకోని విపత్తు ఏర్పడిందన్నదే ఆ వార్త. అక్కడి అణువిద్యుత్ కేంద్రంలోని శీతలీకరణ యంత్రాలు పనిచేయకపోవడం వల్ల, రియాక్టర్ ఒక్కసారిగా వేడెక్కిపోయిందనీ, అయితే రియాక్టర్ ఆగిపోవడంతో పెనువిపత్తు తప్పిందని చెబుతున్నారు.
అణువిద్యుత్ కేంద్రాలలో చిన్నాచితకా ప్రమాదాలు జరగడం వింటున్నదే అయినా, భారతదేశంలో ఇదే మొదటి సంఘటన. ఇలాంటి చోట్ల ప్రమాదం జరిగితే అటు పర్యావరణానికీ, ఇటు ప్రజలకీ దీర్ఘకాలిక నష్టం కలుగుతుంది కాబట్టి... అణు ప్రమాదం అంటేనే ఉలిక్కపడక తప్పదు. అయితే కక్రాపూర్‌లో జరిగిన ప్రమాదం చాలా చిన్నదేననీ, అణువిద్యుత్ కేంద్రాన్ని చల్లబరిచే భారజలం లీక్ అవడం వల్ల, రియాక్టర్ ఒక్కసారిగా వేడెక్కి ఉత్పత్తి నిలిచిపోయిందనీ చెబుతున్నారు. శాస్త్రవేత్తలు ఈ విద్యుత్ కేంద్రాన్ని పరిశీలించి, అంతా సవ్యంగానే ఉందని పేర్కొన్న తరువాతే తిరిగి ఉత్పత్తిన మొదలుపెడతామని హామీ ఇస్తున్నారు కక్రాపూర్ అధికారులు.


.jpg)



