సార్.. ఇప్పుడు జిల్లా పర్యటన వద్దు.. డిప్యూటీసీఎంకు కలెక్టర్ సూచన

బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాన్ కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనావేసింది. తీవ్ర తుపానుగా రూపాంతరం చెందిన మొంథా మంగళవారం నాటికి కాకినాడ సమీపంలో తీరాన్ని తాకే అవకాశం ఉ:దన్న హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శనివారం (అక్టోబర్ 25) జిల్లా కలెక్టర్ తో టెలీకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఎట్టి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు జిల్లాయంత్రాంగాన్ని సన్నద్ధం చేయాలని   ఉండాలని దిశానిర్దేశం చేశారు.  

కాకినాడ జిల్లాలో సముద్ర తీరం ఉన్న తుని, పిఠాపురం, కాకినాడ రూరల్, కాకినాడ అర్బన్ నియోజక వర్గాలతోపాటు తాళ్ళరేవు మండలంపైనా తుపాన్ ప్రభావం ఎక్కువగా ఉండబోతుందన్న అంచనాల నేపథ్యంలో  తుపానుపై ప్రజలను అప్రమత్తం చేయాలనీ, . జిల్లావ్యాప్తంగా తీరం వెంబడి ఉన్న గ్రామాల ప్రజలను సురక్షితంగా ఉంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలనీ, అలాగే తుపాను షెల్టర్లలో ఆహారం, ఔషధాలు, పాలు లాంటివన్నీ అందుబాటులో ఉంచాలని పవన్ ఈ సందర్భంగా సూచించారు. వాతావరణ శాఖ హెచ్చరికలకు  అనుగుణంగా అన్ని విభాగాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. రెవెన్యూ, వ్యవసాయ, నీటిపారుదల, పోలీస్, అగ్నిమాపక శాఖలతోపాటు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలను సిద్ధంగా ఉంచుకోవాలనీ, అదే విధంగా ఉప్పాడ సమీపంలో తీరం కోతకు గురయ్యే ప్రాంతంలో తగు జాగ్రత్తలు తీసుకోవాని పవన్ కల్యాణ్ సూచించారు. తుపాను సహాయక చర్యల పర్యవేక్షణకు జల్లా పర్యటనకు వస్తానని పవన్ కల్యాణ్ అన్నారు.

దీంతో జిల్లా కలెక్టర్ సున్నితంగా వారించారు. తీవ్ర తుపాను నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అంతా  సహాయక చర్యలకు సన్నద్ధమయ్యే పనిలో నిమగ్నమై ఉంటుందనీ, ఈ పరిస్థితులలో జిల్లా పర్యటన వద్దని కోరారు. దీంతో పవన్ కల్యాణ్ పర్యటన ఉద్దేశాన్ని విరమించుకున్నారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu