Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పోర్జరీ కేసులో కాకాణి డిశ్చార్జ్ పిటిషన్ కొట్టివేత...మళ్లీ జైలు జీవితం తప్పదా?
posted on: Apr 30, 2026 2:34PM

నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలింది. గత కొంతకాలంగా సాగుతున్న ఫోర్జరీ పత్రాల కేసులో ఆయన దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్‌ను నెల్లూరులోని 4వ అదనపు జిల్లా కోర్టు కొట్టివేసింది. ఈ నేపథ్యంలో విచారణ నిమిత్తం గురువారం(30-4-26)) కోర్టుకు హాజరుకావాలని న్యాయాధికారి ఆదేశించడంతో కాకాణి హాజరుకాక తప్పలేదు.
పోర్జరీ కేసు నుంచి తన పేరును తొలగించాలని, అలాగే కేసును ప్రజాప్రతినిధుల కోర్టుకు బదిలీ చేయవద్దని కాకాణి కోర్టును కోరారు. అయితే.. అందుకు తగిన ఆధారాలు లేవని భావించిన న్యాయస్థానం.. ఆయన పిటిషన్‌ను తోసిపుచ్చింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇదే కేసులో కీలకమైన ఆధారాలు నెల్లూరు కోర్టు ప్రాంగణం నుంచే చోరీకి గురవ్వడం అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసు విచారణను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి న్యాయాధికారిని కోరారు.
ఈ పరిణామంతో కాకాణి శిబిరంలో మళ్లీ జైలు భయం మొదలైంది. ఇప్పటికే కాకాణి వరదాపురు వైట్ క్వార్ట్జ్ కేసు సహా వరుసగా నమోదైన 8 కేసుల్లో 86 రోజులు నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్ అనుభవించి వచ్చారు. ప్రస్తుతం పోర్జరీ కేసులో ఆయనకు మళ్లీ కారాగార వాసం తప్పదన్న ఆందోళన కాకాణి అనుచరుల్లో కనిపిస్తోంది.






