Latest News

కాకాణిపై పోలీసు స్టేషనులో సోమిరెడ్డి ఫిర్యాదు

posted on: Dec 3, 2025 7:36PM

 

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై సర్వేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు తన ఫిర్యాదును నెల్లూరు రూరల్ పోలీసు స్టేషనులో అందజేశారు. తాను కోట్ల రూపాయలను దోచుకున్నానని కాకాణి నిరాధార ఆరోపణలు చేశారని ఎమ్మెల్యే తెలిపారు. 

దేవుడి గుడిని అభివృద్ధి చేస్తే తప్పు పట్టిన ఘనత కాకానికే దక్కుతుందని తెలిపారు. కాకాణి మనిషి జన్మ ఎత్తితే ఇలాంటి నిరాదార ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు. గతంలోనూ నా పై నిరాధార ఆరోపణలు చేసాడు..మా కుటుంబం దేవాలయాలకు, బడులకు, ఆసుపత్రికి భూములిచ్చిన చరిత్రి మాదని సోమిరెడ్డి తెలిపారు. 

14.5 ఎకరాలు దాదాపు 60 కోట్లు విలువ చేసే భూములిచ్చామని పేర్కొన్నారు. త్వరలో కాకానీ  అండ్ బ్యాచ్ త్వరలో జైలుకు పోక తప్పదని తెలిపారు. కాకానికి మిగిలిన రాజకీయ నాయకుల్లాగా సంస్కారవంతంగా విమర్శలు చేయడం చేత కాదని తెలిపారు. కూటమి ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఆలయ భూములు ఆక్రమణలకు గురవుతున్నాయని, వాటిని పరిరక్షించాలని అన్నారు. ఈ మేరకు గత నవంబరులో ఎమ్మెల్యే సోమిరెడ్డిపై ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనరుకు ఫిర్యాదు చేశారు
 

google-ad-img
    Related Sigment News
    • Loading...