కడపలో విద్యార్థిని ఆత్మహత్య...స్కూల్ వద్ద ఉద్రిక్తత
posted on Nov 10, 2025 2:02PM
.webp)
కడప జిల్లాలో శ్రీ చైతన్య స్కూల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని జస్వంతి హాస్టల్లో ఈ రోజు ఉదయం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయాన్ని పాఠశాల యాజమాన్యం విద్యార్థిని తల్లిదండ్రులకు చెప్పకుండా రిమ్స్‌కు తరలించారు. దీంతో జస్వంతి తల్లిదండ్రులు హాస్పిటల్ కి చేరుకున్నారు. తల్లిదండ్రులకు పల్స్ లేదని డాక్టర్స్ చెప్పడంతో మెడ చుట్టూ ఉరి వేసుకున్న ఆనవాళ్లు కనపడంతో అనుమానస్పదంగా ఉందని స్కూల్ యాజమాన్యాన్ని ప్రశ్నించగా బాత్రూమ్ లో ఉరి వేసుకుందని చెప్పున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
వారే మా పిల్లని హత్య చేశారని విద్యార్థిని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మృతదేహాన్ని రిమ్స్ మార్చురీకి తరలించడం జరిగింది .అక్కడ పెద్ద ఎత్తున తల్లిదండ్రులు బంధువులు ఆందోళన దిగారు. ఈరోజు ఉదయం స్కూల్ యాజమాన్యం నుంచి తల్లిదండ్రులకి ఫోన్ కాల్ వచ్చిందని. అయితే విషయం దాచిపెట్టి ఆరోగ్య సమస్యలు ఉన్నాయని ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్తున్నామని తెలపారని వారు వెల్లడించారు.