కడప కలెక్టర్ కు తృటిలో తప్పిన పెను ప్రమాదం

posted on: Feb 11, 2026 8:34AM

కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ కు తృటిలో పెను ప్రమాదం తప్పింది.   మంగళవారం (ఫిబ్రవరి 10) రాత్రి ఆయన ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. చాపాడులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న వాహనానికి ముందు వెడుతున్న వాహనం వేగం అకస్మాత్తుగా తగ్గించడంతో కలెక్టర్ చెరుకూరి శ్రీథర్ అప్రమత్తమై తన వాహనం వేగాన్ని నియంత్రించారు.

అయితే వెనుక వస్తున్న లారీ ఆయన వాహనాన్ని బలంగా ఢీ కొంది. ఈ ప్రమాదంలో కలెక్టర్ ప్రయాణిస్తున్న వాహనం వెనుక భాగం నుజ్జునుజ్జు అయ్యింది.   ఈ ప్రమాదం నుంచి కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ క్షేమంగా బయటపడ్డారు.   లారీ వేగం ఇంకాస్త ఎక్కువగా ఉన్నా, లేదా కారు అదుపు తప్పి పక్కకు వెళ్లినా పరిస్థితి మరోలా ఉండేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.   

google-ad-img
    Related Sigment News
    • Loading...