యువకుడి ప్రాణం కాపాడిన కాచిగూడ పోలీసులు

posted on: May 26, 2026 2:23PM

కాచిగూడ రైల్వే స్టేషన్ పరిధిలో పోలీసులు అప్రమత్తంగా స్పందించి రైలు పట్టాలపై ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఓ యువకుడి ప్రాణాలను కాపాడారు. నిన్న సోమవారం(మే 25) అర్ధరాత్రి సమయంలో కాచిగూడ పోలీస్ స్టేషన్ సెక్షన్ ఇన్‌ఛార్జ్ హెడ్ కానిస్టేబుల్ డియుగంధర్‌కు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లోని తాడిపత్రిచెందిన   నాగరాజు అనే వ్యక్తి ఆ ఫోన్ చేశాడు.  నిరంజన్ అనే తన కుమారుడు కర్నూలులోని జయరాజ్ స్టీల్స్‌లో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. అతను తీవ్ర మానసిక ఒత్తిడికి గురై కాచిగూడ రైల్వే స్టేషన్ రైలు పట్టాలపై ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్నాడని, ఆ విషయం తెలియజేస్తూ.. తనకు వీడియో పంపాడని తెలిపారు. దీంతో వెంటనే ఎస్‌హెచ్‌వో  రాజశేఖర్ ఆదేశాల మేరకు బ్లూ కోల్ట్-1 సిబ్బంది కానిస్టేబుళ్లు వి. చంద్ర పెద్దిరాజు, ఎస్. బాల మల్లేష్ వెంటనే రైల్వే స్టేషన్‌కు చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు.

5వ నంబర్ ప్లాట్‌ఫాం  వద్ద రైలు పట్టాలపై పడుకొని ఉన్న నిరంజన్‌ను గుర్తించిన పోలీసులు, రైల్వే పోలీసులను  అప్రమత్తం చేసి యువకుడిని సురక్షితంగా పట్టాలపై నుంచి బయటకు తీసుకువచ్చారు. అనంతరం ఆ యువకుడికి కౌన్సెలింగ్ ఇచ్చి జీఆర్పీ అధికారులకు అప్పగించారు. తమ కొడుకు ప్రాణాలు పోలీసులు రక్షించారని తెలియగానే ఆ తల్లిదండ్రులు పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...