Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తమిళనాట అన్నామలై క్రేజ్...24 గంటల్లో 14 లక్షల మంది చేరిక!
posted on: Jun 6, 2026 9:04PM

తమిళనాట బీజేపీకి ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి కె.అన్నామలై మూడు రోజుల క్రితం రాజీనామా చేశారు. దేశ రాజకీయాల్లో కొత్త మార్పుల కోసం అంటూ.. ‘ఉయ్ ద లీడర్స్’ అనే ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ ఉద్యమంలో చేరాలనే అన్నామలై పిలుపునకు అనూహ్య స్పందన వస్తోంది. 2031 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా పార్టీని ఏర్పాటుచేయనున్నట్టు వెల్లడించిన ఆయన.. దానికి ముందు ‘వి ద లీడర్స్’ ఉద్యమాన్ని ప్రకటించారు.
తమిళనాడు ప్రజల హక్కులకోసం, రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు ఈ ఉద్యమం చేపట్టినట్టు చెప్పారు. ఆయన పిలుపునకు భారీ స్పందన లభిస్తోంది. భారీగా బీజేపీ కార్యకర్తలు, అభిమానులు ఆయనకు మద్దతు తెలుపుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఈ ఉద్యమానికి ఆన్‌లైన్ లింక్ ద్వారా మద్దతు తెలుపుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. గత 24 గంటల్లోనే దాదాపు 14 లక్షలు మంది చేరినట్టు వెబ్‌సైట్‌లో నమోదయ్యింది.





