జూబ్లీ బైపోల్.. నవీన్ యాదవ్ తండ్రి బైండోవర్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ.. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు బిగ్ షాక్ తగిలింది. సరిగ్గా ప్రచారం జోరందుకున్న వేళ నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ ను పోలీసులు బైం బోవర్ చేశారు. ఈ ఉప ఎన్నిక సందర్భంగా నియోజకవర్గంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం పలువురిని పోలీసులు బైండోవర్ చేశారు. చిన్న శ్రైశైలం యాదవ్ సహా దాదాపు వంద మంది రౌడీషీటర్లను పోలీసులు బైండోవర్ చేశారు. ఇలా బైండోవర్ అయిన వారిలో అత్యధికులు అంటే 74 మంది వరకూ బోరబండపోలీసు స్టేషన్ పరిధిలోని వారే కావడం గమనార్హం.  

బైండోవర్ అంటే.. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తారన్న అనుమానం ఉన్న వ్యక్తులను ఎన్నికల సమయంలో ముందస్తు జాగ్రత్తగా తహశీల్దార్ లేదా ఆర్డీవో ఎదుట హాజరు పరిచి.. ఆ వ్యక్తి చేత లిఖిత పూర్వకంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించబోనని బ్యాండ్ పైపర్ పై రాయించుకుంటారు. ఆ తరువాత వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేస్తారు. జూబ్లీ ఎన్నికల వేళ ఆ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తండ్రిని పోలీసులు బైండోవర్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu