జూబ్లీ బైపోల్.. కౌంటింగ్ వేళ ఇండిపెండెంట్ ఆభ్యర్థి మృతి

జూబ్లీ ఉప ఎన్నిక కౌంటింగ్ సందర్భంగా తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈ ఉప ఎన్నికలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన మహ్మద్ అన్వర్.. కౌంటింగ్ సందర్భంగా తీవ్ర టెన్షన్ కు లోనై గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన వయస్సు 40 ఏళ్లు.  

ఎర్రగడ్డలో నివాసముండే మహ్మాద్ అన్వర్ ఉదయం నుంచి  కౌంటింగ్ ప్రక్రియను ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు గుండెపోటు వచ్చి కుప్పకూలిపోయారు. ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే ఆయన అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు.  ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ, ఓటమి భయం, ఆందోళనే ఆయన మరణానికి కారణమని అంటున్నారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu