జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయం : టీపీసీసీ చీఫ్

 

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయమే ఖాయమని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. జూబ్లీహిల్స్ బైపోల్ నేపథ్యంలో టీపీసీసీ ఆధ్వర్యంలో టూరిజం ప్లాజాలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గోన్నారు. ఈ సందర్బంగా టీపీసీసీ చీఫ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ  పార్టీ గెలుపు కోసం ప్రతి నాయకుడు, కార్యకర్త సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అధిక మెజార్టీతో గెలవడం లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు. 

అప్పగించిన బాధ్యతలను పకడ్బందీగా నిర్వర్తించాల్సిన అవసరాన్ని ఆయన హితవు పలికారు. చిన్నపాటి నిర్లక్ష్యం కూడా పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీయవచ్చని గుర్తుచేశారు. ఈ సందర్భంగా ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా నేతలతో చర్చించి, ప్రచార వ్యూహంపై మార్గదర్శకత్వం వహించారు. కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్‌లో ఘన విజయం సాధించేలా అందరూ కృషి చేయాలని నేతలు నిర్ణయించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, వివిధ డివిజన్‌లకు బాధ్యతలు చేపట్టిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్‌లు పాల్గొన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu