బీఆర్‌ఎస్ ఓటమి ....కవిత షాకింగ్ ట్వీట్

posted on: Nov 14, 2025 4:10PM

 

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక రిజల్డ్స్  వెలువడిన తర్వాత తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత సంచలన ట్వీట్  చేసింది. కర్మ హిట్స్‌ బ్యాక్‌’’ అంటూ ఎక్స్‌ వేదికగా ఆమె పేర్కొన్నది. దండం పేట్టే ఎమోజీలతో ట్వీట్ ఆసక్తికరంగా మారింది. ఇవాళ వెలువడిన జూబ్లీ ఫలితాల్లో బీఆర్‌ఎస్  ఓటమి చవి చూసిన సంగతి తెలిసిందే. 

ఇటీవల కవిత బీఆర్‌ఎస్ పార్టీ నుంచి బయటికి వచ్చిన ఆమె అధినేత కేసీఆర్ మినహా మిగతా నేతలపై తీవ్ర విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌కు 98,988 ఓట్లు, బీఆర్‌ఎస్  అభ్యర్థి మాగంటి సునీతకు 74,259 ఓట్లు, బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డికి 17,061 ఓట్లు పోలయ్యాయి.

google-ad-img
    Related Sigment News
    • Loading...