జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక దృష్ట్యా సీపీ ఆంక్షలు జారీ
posted on Nov 8, 2025 3:49PM

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ కీలక ఆదేశాలు జారీ చేశారు. నవంబర్ 9 సాయంత్రం 6 గంటల నుంచి 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఆంక్షలు అమలు ఉంటాయిని నోటిఫికేషన్ విడుదల చేశారు. కౌంటింగ్ సందర్భంగా నవంబర్ 14 ఉదయం 6 గంటల నుంచి 15వ తేదీ ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు ఉంటాయని పేర్కొన్నారు..
ప్రజాశాంతి, భద్రత కోసం జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలో బీఎన్ఎస్ఎస్ 163 సెక్షన్ అమల్లో ఉండనున్నట్లు తెలిపారు. ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది ఒక్కచోట గుంపుగా ఉండొద్దని సూచించారు. పోలింగ్ కేంద్రాల నుంచి 200 మీటర్ల వరకు ఈ రూల్ వర్తిస్తుందని తెలిపారు. ఈ నిర్దేశించిన సమయాల్లో నియోజవర్గంలో పరిధిలోని మద్యం దుకాణాలు , రెస్టారెంట్‍లు, క్లబ్బులు మూసివేయాలని సీపీ ఆదేశించారు. జూబ్లీహిల్స్ నియెజకవర్గ పరిధిలో ఎవ్వరూ బాణాసంచా పేల్చొద్దని సీపీ వీసీ సజ్జనార్ సూచించారు.