పవన్ పోస్టర్ వివాదం: జూనియర్ ఫ్యాన్స్ ఓవర్ యాక్షన్!

 

 

 

నల్లగొండ జిల్లా హుజూర్‌నగర్ నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థి స్వామిగౌడ్ తన పోస్టర్లలో పవన్ కళ్యాణ్ ఫొటో వేసినందుకు నిరసనగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పోస్టర్లు చించేయడం, తమ హీరో ఫొటోలు ఎందుకు వేయలేదని గొడవ పడిన విషయం తెలిసిందే. అయితే ఈ అంశాన్ని తెలుగుదేశం వర్గాలు సీరియస్‌గా తీసుకుంటున్నాయి.

 

జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ విషయంలో ఓవర్ యాక్షన్ చేస్తున్నారని ఆ వర్గాలు అంటున్నాయి. అమ్మ పెట్టదు అడుక్కు తిననీయదన్నట్టు జూనియర్ ఎన్టీఆర్ ప్రచారానికి రాడు. బొట్టుపెట్టి పిలిస్తేనే వచ్చే విషయం ఆలోచిస్తానని అంటాడు. ఒకవేళ పిలిచినా వస్తాడో రాడో, ఎన్ని కండీషన్లు పెడతాడో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశానికి చేరువైన పవన్ కళ్యాణ్ ఫొటోని పోస్టర్లలో వేస్తే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు ఇంత కోపమెందుకు వస్తోందో అర్థం కావడం లేదని అంటున్నారు.



పోస్టర్లలో పవన్ ఫొటో చూసి జూనియర్ అభిమానులు తట్టుకోలేకపోతే జూనియర్ ఎన్టీఆర్ దగ్గరకి వెళ్ళి ప్రచారానికి ఒప్పించండి అప్పుడు ఎవరూ అడగకపోయినా జూనియర్ ఎన్టీఆర్ ఫొటో పోస్టర్లలో వేస్తామని ఆఫర్ ఇస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో వుండి కూడా ప్రచారానికి ముందుకు రాని జూనియర్ ఎన్టీఆర్ని తెలుగుదేశంలో ఉన్నట్టు ఎందుకు భావించాలని ప్రశ్నిస్తున్నారు. గతంలో నారా లోకేష్ జూనియర్ ఎన్టీఆర్‌ని కలుపుకుని పోవాలని అనుకున్నప్పటికీ అటు నుంచి సరైన స్పందన రాలేదని ఈ సందర్భంగా వారు గుర్తు చేస్తున్నారు. అంచేత ఇకనైనా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఓవర్ యాక్షన్ మానుకోవాలని హెచ్చరిస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu