ఇదెక్కడి గోల రా బాబు..!

posted on: Jan 22, 2016 11:24AM

ఈ మధ్య కాలంలో అందరికి మంచి హాట్ టాపిక్ గా నిలిచిన మేటర్ ఏంటంటే.. అది జూనియర్ ఎన్టీఆర్.. బాలయ్యల వివాదం అని టక్కున చెప్పొచ్చు. అలా ఇప్పుడు బాబాయ్ తోనే ఇబ్బందులు పడుతున్న ఎన్టీఆర్ కు ఇప్పుడు కొత్త ఇబ్బందులు వచ్చి పడుతున్నాయి. అది కూడా టీ టీడీపీ నేతల వల్ల. అది కూడా తనకు ఏమాత్రం సంబంధం లేకుండా.. దీనంతటికి కారణం గ్రేటర్ ఎన్నికలు కావడం విశేషం.

ఏపీ లో అధికారంలో ఉన్న టీ టీడీపీ కి అక్కడ ఎలాంటి డోకా లేదనే చెప్పొచ్చు. అక్కడ ప్రతిపక్ష పార్టీ అయిన వైకాపా పరిస్థితే అంతంత మాత్రంగా ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ ఉన్నా ఒకటే.. లేకపోయినా ఒకటే అన్నట్టు ఉంది. కానీ తెలంగాణ పరిస్థితి వేరు. ఇక్కడ అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ గెలుపు పంథాలో దూసుకుపోతుంది. ఆ పార్టీని అధిగమించాలంటే మిగిలిన పార్టీలు చాలా కష్టపడాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ టీడీపీ పరిస్థితి వేరు. ప్రస్తుతానికి నాయ‌కుల మ‌ధ్య విభేదాలతో.. తెలుగుదేశం పార్టీ కొంత ఇబ్బందికర ప‌రిస్థితి ఎదుర్కొంటోంది. మరోవైపు పార్టీ అధినేత చంద్రబాబు ఏపీ అభివృద్ధి కోసం కృషి చేస్తూ ఇక్కడ పరిస్థితిపపై శ్ర‌ద్ధ వ‌హించ‌డం లేదు. ఈ నేపథ్యంలో కొంతమంది పార్టీ నేతలు తెలంగాణలో పార్టీ కోసం పనిచేసి.. పార్టీలో పున‌రుత్తేజాన్ని నెలకొల్పే నేత కోసం కొంద‌రు ఎదురుచూస్తున్నారట. అయితే అసలు ట్విస్ట్ ఏంటంటే ఆ నేత ఎవరో కాదు జూనియర్ ఎన్టీఆర్ కావడం విశేషం. అంతేకాదు టీఎన్‌ఎస్‌ఎఫ్ ఉపాధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ టీడీపీ బాధ్య‌త‌లు ఎన్టీఆర్‌కి అప్ప‌గించాల‌ని కొంత‌మంది టీడీపీ నాయ‌కులు ఏకంగా పార్టీ కార్యాల‌యంలోనే ధ‌ర్నాచేశారు. అక్కడితో ఆగకుండా..అక్కడున్న లోకేష్ కటౌట్లను, కార్యకర్తలకు ఆర్థిక సాయం చేసినట్లు చూపించే ఫ్లెక్సీలను చించేశారట. గ్రేటర్ టికెట్ల కేటాయింపులో జరిగిన అవకతవకలు, నాయకులు సీట్లు అమ్ముకోవడం వంటివాటిపై విచారణ జరిపించాలని అందులో కోరారట.

అసలు తనకు ఏమాత్రం సంబంధం లేని ఈ వివాదంపై ఎన్టీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి. మరోవైపు తనపాటికి తాను నాన్న‌కు ప్రేమ‌తో సినిమా స‌క్సెస్‌ను ఎంజాయ్ చేస్తుంటే.. తనను ఈరొంపులోకి లాగడం ఏంటని.. ఇప్పటికే బాబాయ్‌తో విభేదాలున్నాయ‌న్న కార‌ణంగా.. నాన్న‌కు ప్రేమ‌తో సినిమాకు కొన్ని చోట్ల ఇబ్బందులు ఎదుర‌వుతుంటే.. ఇప్పుడు కొత్తగా ఈ సమస్య ఏంటని.. అనవసరంగా ఎన్టీఆర్ ను ఆ వివాదంలోకి లాగుతున్నారని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...