Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...అంకురార్పణతో జొన్నవాడ వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం
posted on: May 8, 2026 9:41AM
.webp)
ప్రముఖపుణ్యక్షేత్రమైన జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం అంకురార్పణతో ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలకు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి హాజరై పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. వేద పండితులు ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి పెన్నా నది తీరం నుండి పుట్టిమట్టి తీసుకొచ్చి అమ్మవారి ప్రతిబింబాన్ని ప్రతిష్టించి జలాలతో అభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పటిష్టంగా ఏర్పాటు చేయాలని విచ్చేసిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విజయవంతంగా నిర్వహించాలని సూచించారు.
.webp)
దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సహకారంతో జొన్నవాడ కామాక్షితాయి ఆలయానికి శాశ్వతంగా ప్రముఖ పుణ్యక్షేత్రాలైనవిజయవాడ,శ్రీశైలం, శ్రీకాళహస్తి ఆలయాల నుండి సారెను ఆనవాయితీగా తీసుకొచ్చేందుకు జీవో జారీ చేసినట్లు తెలిపారు. భక్తులు బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు కూటమి నాయకులు పాల్గొన్నారు.



.webp)



