జోగి రమేష్ బెయిల్ రద్దు చేయాలని కోర్టులో పిటిషన్
posted on: Feb 2, 2026 5:47PM
.webp)
మాజీ మంత్రి జోగి రమేష్, రాము బెయిల్ రద్దు చేయాలని విజయవాడ ఎక్సైజ్ కోర్టులో సిట్ పిటిషన్ దాఖలు చేసింది. నకిలీ మద్యం కేసులో జోగి బ్రదర్స్ కీలక నిందితులని వారికి బెయిల్ ఇవ్వడం వల్ల సాక్ష్యాధారాలను ధ్వంసం చేసే ప్రమాదం ఉందని పిటిషన్‌లో పేర్కొంది. దీనిపై మంగళవారం విచారణ జరిగే అవకాశం ఉంది. కాగా 80 రోజులుగా జైల్లో ఉన్నవీరికి ఇటీవల న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.
మరోవైపు జోగి రమేష్ ఇంటి వద్ద భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశించింది. జోగి రోహిత్ వేసిన పిటిషన్‌పై కోర్టు ఆదేశాలిచ్చింది. రమేష్‌పై ఎలాంటి దాడులు జరిగిన పోలీసులదే బాధ్యత అని స్పష్టం చేశారు. జోగి రమేష్ ఇంటిపై దాడి ఘటనల్లో పోలీసులు 40 మందిపై కేసులు నమోదు చేశారు.






