Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కన్నయా మీద మరో కేసు నమోదు
posted on: Mar 10, 2016 3:15PM
.jpg)
జేఎన్‌యూలో భారతవ్యతిరేక నినాదాలు చేసినందుకుగాను దేశద్రోహం కేసుని ఎదుర్కొంటున్న కన్నయాకుమార్‌ను, బెయిల్ మీద బయటకు వచ్చాక కూడా వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. తాజాగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చేసిన ఒక ఉపన్యాసంలో, కన్నయాకుమార్ దేశ సైనికుల మీద చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్నే రేపుతున్నాయి. ‘కశ్మీర్‌లోని భారతీయ సైనికులు అక్కడి స్త్రీల మీద అత్యాచారాలకు పాల్పడుతున్నారు’ అంటూ కన్నయా చేసిన వ్యాఖ్యల మీద కాన్పూర్‌లో ఒక ఫిర్యాదు నమోదైంది.
కన్నయాతో పాటుగా జేఎన్‌యూ ప్రొఫెసర్ నివేదితా మీనన్‌ను కూడా ఈ ఫిర్యాదులో చేర్చినట్లు సమాచారం. నివేదిత తను ఉపన్యసించే చోటల్లా భారతీయ సైనికుల గురించి చెడుగా మాట్లాడతారనీ, కశ్మీర్‌ను మన దేశం బలవంతంగా ఆక్రమించిందని జనాలని రెచ్చగొడుతూ ఉంటారని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. కాన్పూర్ పోలీసులు కనుక ఈ ఫిర్యాదుని FIRగా మారిస్తే కన్నయా మరోసారి కోర్టు మెట్లు ఎక్కక తప్పదు!


.jpg)



