Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...జేఎన్‌యూ వివాదం బయటి వ్యక్తుల పనే!
posted on: Mar 16, 2016 10:26AM
.jpg)
జేఎన్‌యూలో వివాదాస్పద నినాదాలు చేసిన సంఘటనకి బయటి వ్యక్తులే కారణం అంటూ విశ్వవిద్యాలయం రూపొందించిన నివేదిక పేర్కొంది. ముసుగు వేసుకుని సమావేశంలోకి వచ్చిన కొందరు వ్యక్తులు భారత్‌కు వ్యతిరేకంగా, అఫ్జల్ గురుకు అనుకూలంగా నినాదాలు చేశారని స్పష్టం చేసింది. ఇందులో విద్యార్థి నాయకుడు కన్నయా కుమార్ ప్రమేయం ఏదీ లేదనీ... అయితేగియితే ఉమర్‌ఖాలిద్, అనిర్బన్ భట్టాచార్య తప్పు మాత్రం ఉందనీ పేర్కొంది. ఈ నివేదిక ఆధారంగా సదరు విద్యార్థులందరికీ విశ్వవిద్యాలయం షోకాజ్ నోటీసులను జారీ చేసింది. అయితే ఇందులో వారిని బహిష్కరించే అవకాశం ఉన్నట్లు ఎక్కడా పేర్కొనలేదు. ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న జేఎన్‌యూ విద్యార్థులను మరింత రెచ్చగొట్టకుండా ఉండేందుకు, విశ్వవిద్యాలయ యాజమాన్యం ఆచితూచి స్పందిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఇంతకీ జేఎన్‌యూలో అలజడి సృష్టించేందుకు ప్రయత్నించిన ఈ బయటి వ్యక్తులు ఎవరు? ఎవరి ప్రోత్సాహంతో వారు ఈ సమావేశంలో పాల్గొన్నారన్న విషయాన్ని మాత్రం ఈ నివేదిక కనుగొనేందుకు ప్రయత్నించలేదు!






