Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Jayam Serial : ఇషికకు ఇందుమతి వార్నింగ్.. గంగ తల్లిదండ్రుల వేటలో లక్ష్మి!
posted on: Mar 19, 2026 10:57AM
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -220 లో..... ఇందుమతిని రంగా రెచ్చగొడుతాడు. దాంతో ఇషికని తన గ్రిప్ లో పెట్టుకోవాలని ఇందుమతి అంటుంది. ఇషిక వెళ్లి కాఫీ తీసుకొని రమ్మని చెప్తుంది. నాకు చెయ్యడం రాదని ఇషిక అనగానే అయితే నా కొడుకుకి నీకు విడాకులు ఇస్తానని ఇందుమతి అనగానే ఇషిక భయపడి తీసుకొని వస్తానని వెళ్ళిపోతుంది. ఇందుమతి దగ్గరికి రంగా వస్తాడు. మీరు చాలా గ్రేట్ మేడమ్ అని రంగా అనగానే నా పర్ఫామెన్స్ ఎలా ఉందని అడుగుతుంది. మేడం సర్ మేడం అంతే అని రంగా అంటాడు.
ఆ తర్వాత రంగా బయటకు వెళ్లి ఆ ఇంగ్లీష్ మేడమ్ ని ఇషిక పైకి రెచ్చగొట్టాను ఒక ఆట అడేసుకుందని రంగా చెప్పగానే గంగ నవ్వుకుంటుంది. కానీ నువ్వు, బావ ఇంకా దగ్గర కావాలని రంగా అంటాడు. అంటే ఎలా అని గంగా అడుగుతుంది. నువ్వు బావ సర్ అని కాకుండా బావ, ఏవండీ, డార్లింగ్ అని పిలువు అని రంగా చెప్పగానే గంగ సిగ్గుపడుతుంది. నువ్వు ప్రొద్దున గుడికి వెళ్ళావ్ కదా.. ప్రసాదం బొట్టు తీసుకొని తన దగ్గరికి వెళ్ళు కుంకుమ కళ్ళలో పడితే నువ్వు ఊదు అని రంగా ప్లాన్ చెప్తాడు. దాంతో గంగ బొట్టు పట్టుకొని రుద్ర దగ్గరికి వెళ్ళి బొట్టు పెడుతుంది. అలాగే చూస్తుంది. ఏంటని రుద్ర అడుగుతాడు. కళ్ళలో బొట్టు పడుతుందేమోనని గంగ అంటుంది. పడట్లేదు కానీ ఇక్కడ నుండి వెళ్ళొపో అని రుద్ర అంటాడు. అప్పుడే గంగకి కళ్ళలో కుంకుమ పడుతుంది. దాంతో రుద్ర తన కళ్లలో ఉదుతాడు. అదంతా రంగా చూసి ప్లాన్ సక్సెస్ అనుకుంటాడు.
ఆ తర్వాత లక్ష్మీ పాత సూట్ కేసులో గంగ అసలైన పేరెంట్స్ అడ్రెస్ కోసం వెతుకుతుంది. అడ్రెస్ చూసి ఈ అడ్రెస్ ఎక్కడో వివరాలు కనుక్కోమని పైడిరాజుకి లక్ష్మి అడ్రెస్ ఇస్తుంది. ఆ తర్వాత ఇంట్లో నేను చెప్పినట్లు ఏది జరగడం లేదని పెద్దసారుతో శకుంతల అంటుంది. అప్పుడే రుద్ర వచ్చి మీతో మాట్లాడాలని పెద్దసారుతో అంటాడు. తరువాయి భాగంలో గంగ పేరెంట్స్ పిన్ని బాబాయ్ కాదని రుద్రకి రంగా చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




