జయలలిత రాజీనామా చేస్తారా లేదా?
posted on: Jun 18, 2014 3:45PM

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకి ఇప్పుడు పెద్ద ధర్మసంకటం ఎదురైంది. తమిళనాడులో ఎదురులేని నాయకురాలిగా పరిపాలన చేస్తున్న జయలలిత కోర్టు దగ్గర మాత్రం ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. జయలలిత మీద ఎప్పటి నుంచో వున్న ఆదాయానికి మించిన ఆస్తుల కేసును ఆమె ఇంతకాలం ఏదో ఒక విధంగా మేనేజ్ చేస్తూ వచ్చారు. ఇప్పుడా కేసు జయలలితకు పెద్ద తలనొప్పిలా తయారైంది. ఈ కేసులో తమిళనాడు సీఎం జయలలితకు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. 66 కోట్ల రూపాయల ఆస్తులకు సంబంధించిన ఈ కేసు విచారణపై విధించిన స్టేను కోర్టు ఎత్తివేసింది. దాంతో ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు ముమ్మరంగా జరిగే అవకాశం వుంది. తన మీద ఒక కేసు దర్యాప్తు జరుగుతూ వుండగా జయలలిత ముఖ్యమంత్రి పదవిలో కొనసాగడం నైతికంగా ఎంతవరకు కరెక్టన్న వాదన వినిపిస్తోంది. తనపై జరుగుతున్న దర్యాప్తుకు సహకరిస్తూ ఆమె తన ముఖ్యమంత్రి పదవిని వదిలిపెడితే మంచిదన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జయలలిత తన పదవికి రాజీనామా చేస్తారా లేదా అని దేశంలోని రాజకీయ వర్గాలు ఆసక్తిగా చూస్తున్నాయి.



.jpg)
.jpg)

.webp)



