Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...జేఎన్‌యూలో మరో వివాదం... మనుస్మృతిని తగలబెట్టారు
posted on: Mar 9, 2016 10:33AM
.jpg)
దిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఒకదాని తరువాత ఒకటి వివాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా ఏబీవీపి విద్యార్థి సంఘం నేతలు కొందరు మనుస్మృతిని తగలబెట్టడంతో మరోసారి జేఎన్‌యూ వార్తల్లో నిలిచింది. మనుస్మృతిలోని కొన్ని అంశాలు స్ర్తీలకు వ్యతిరేకంగా ఉన్నాయనీ, అందుకని ప్రపంచ మహిళా దినోత్సం సందర్భంగా తాము ఈ పని చేస్తున్నామనీ ఏబీవీపీ వారు చెప్పుకొచ్చారు. మనుస్మృతిలో కనీసం 40 అంశాల మీద తమకు అభ్యంతరాలు ఉన్నాయనీ, ఈ విషయంలో ఎవరితోనైనా వాదించేందుకు సిద్ధంగా ఉన్నామనీ సవాలు విసిరారు.
మనుధర్మశాస్ర్తంగా పిలవబడే మనుస్మృతిలో కులాల ఆవిర్బావానికి సంబంధించి కొన్ని కీలక ప్రస్తావనలు ఉన్న విషయం తెలిసిందే! అందుకే వివక్షకి సంబంధించిన చారిత్రక అంశాలు పేర్కొనేటప్పుడు ఉద్యమకారులు తరచూ మనుస్మృతిని నిందిస్తూ ఉంటారు. ఇప్పటికే సున్నితంగా ఉన్న జేఎన్‌యూలోని పరిస్థితులు నిన్న జరిగిన ఘటనతో తిరిగి ఉద్రిక్తంగా మారినట్లు అయింది. జేఎన్‌యూ అధికారులు ఈ ఆందోళనకు ఎలాంటి అనుమతినీ ఇవ్వనప్పటికీ, కార్యక్రమం యథావిథిగా కొనసాగడం గమనార్హం. రోహిత్, కన్నయాకుమార్‌ల వివాదంలో ఏబీవీపీ సంఘానికి దళితవ్యతిరేకిగా ముద్రపడటంతో, వారు ఈ తాజా చర్యకు పూనుకుని ఉండవచ్చని విశ్లేషకులు అంటున్నారు.


.jpg)
.jpg)


