Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...వైసీపీకి ఆ కామన్ సెన్స్ కూడా లేకుండా పోయింది....
posted on: Nov 25, 2017 2:40PM
.jpg)
వెనుకటికి ఓ సామెత ఉండేది.. మనం చేస్తే సంసారం.. ఇంకెకొడు చేస్తే.. ఇంకేదో అట..అలా ఉంది ప్రస్తుతం వైసీపీ పరిస్థితి చూస్తుంటే. ఏదో ఒక విషయంపై అనవసరపు యాగి చేయడం.. ఆతరువాత వేలెత్తి చూపించుకోవడం అలవాటైపోయింది. ఇప్పుడు ఇందంతా ఎందుకంటే... తాజాగా అలాంటి తప్పే చేసి ఇరుకున పడింది వైసీపీ. అది కూడా జనసేన పార్టీ విషయంలో. 2019 వ సంవత్సరంలో జనసేన పార్టీ ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి దిగాలనుకుంటున్న సంగతి తెలిసిందే. దీనికి ఇప్పటినుండే.. పార్టీ గ్రౌండ్ వర్క్ చేస్తుంది. ఇందులోభాగంగానే అక్కడక్కడ పార్టీ కార్యాలయాలు కూడా ఏర్పాటు చేస్తుంది. ఈ క్రమంలో మంగళగిరి సమీపంలోని చినకాకాని వద్ద జనసేన ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేయలనుకుంది. అయితే కొన్ని ఆర్ధిక పరిస్థితుల కారణంగా భూమిని కొనుగోలు చేయలేక లీజు పద్ధతిలో భూమిని తీసుకుని కార్యాలయ ఏర్పాటుకు జనసేన సన్నాహాలు చేస్తోంది. ఇప్పుడు ఇది వైసీపీకి ప్రాబ్లమైనట్టు ఉంది. అందుకే ఈ విషయంలో కూడా వేలు పడింది. వైసీపీ అనుకూల సోషల్ మీడియాలో.. అక్కడ భూమి కొనలేదు కాబట్టి జనసేన తాత్కాలిక టెంట్ వేస్తున్నట్టు ప్రొజెక్ట్ చేస్తోంది.
కానీ ఇక్కడే వైసీపీ ఓ విషయం మర్చిపోయినట్టు ఉంది. అదేంటంటే..నిజానికి ఓ రెండు నెలల ముందు వైసీపీ కూడా విజయవాడలో పార్టీ నేతకు చెందిన భూమిలో తాత్కాలిక కార్యాలయం నిర్మించింది. సొంత పార్టీ వాళ్ళు ఏ సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో వైసీపీ విజయవాడలో ఆఫీస్ పెట్టింది. అయితే ఇప్పటికీ ఆ ఆఫీస్ నుంచి జగన్ పెద్దగా కార్యకలాపాలు సాగించింది లేదు. మొత్తం హైదరాబాద్ లోటస్ పాండ్ నుంచే నేటికీ వ్యవహారాలు నడుస్తున్నాయి. ఇక ఈ వ్యవహారాన్ని మొత్తం గాలికి వదిలేసి జనసేన మీద పడింది. ముందు వైసీపీ చేసే పనులు చూసుకోకుండా.. పక్కననోళ్లకు నీతులు చెబుతుందని అంటున్నారు. అందుకే మనం ఒకరివైపు వేలెత్తి చూపితే నాలుగు వేళ్ళు మన వైపు తిరిగి చూస్తాయి అని వైసీపీ ఎప్పుడు తెలుసుకుంటుందో మరి...



.jpg)


