Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...జనగామ, తొర్రూరులో లక్కీ డ్రా... కాంగ్రెస్‌దే విజయం
posted on: Feb 17, 2026 2:24PM

అనూహ్య పరిణామాల మధ్య జనగామ మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక ముగిసింది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌కు సమాన ఓట్లు రావడంతో అధికారులు లక్కీ డ్రా తీశారు. ఇందులో కాంగ్రెస్‌నే అదృష్టం వరించింది. హస్తం పార్టీకి చెందిన బాలమణి ఛైర్ పర్సన్‌గా ఎన్నికయ్యారు. దీంతో బీఆర్‌ఎస్ సభ్యులు నిరసనకు దిగారు. వైస్ ఛైర్మన్ ఎన్నికను అడ్డుకున్నారు. మరోవైపు తొర్రూరు మున్సిపాలిలీలోనూ లక్కీ డ్రాగా తీయగా కాంగ్రెస్ ఛైర్మన్ శ్రవణ్ పదవి దక్కింది.
మున్సిపల్ చైర్మన్ పదవి కోసం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. ఇరు పార్టీలకు సమానంగా ఓట్లు రావడంతో విజయం ఎవరిని వరిస్తుందనే ఉత్కంఠ నెలకొంది.ఈ నేపథ్యంలో అధికారులు నిబంధనల ప్రకారం లాటరీ పద్ధతిని అనుసరించారు. లాటరీలో అదృష్టం కాంగ్రెస్ అభ్యర్థి తూనం శ్రవణ్‌ను వరించడంతో, ఆయన్ను మున్సిపల్ చైర్మన్‌గా అధికారులు ప్రకటించారు.
బీఆర్ఎస్ కంచుకోటగా భావించే ఈ ప్రాంతంలో కాంగ్రెస్ జెండా ఎగరవేయడం స్థానిక రాజకీయాల్లోచర్చనీయాంశంగా మారింది. ఇక ఎన్నికల సందర్భంగా మున్సిపల్ కార్యాలయం వద్ద భారీగా చేరుకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట జరగడంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తొర్రూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై స్పందిస్తూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కంటతడి పెట్టారు. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. చివరికి ఫలితం వెలువడటంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. ఖానాపూర్ మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక మళ్లీ వాయిదా పడింది. ఎన్నికకు కోరం లేకపోవడంతో వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు.
మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలో హై టెన్షన్ నెలకొంది. బీఆర్ఎస్ కౌన్సిలర్లను ఛైర్మెన్ ఎన్నికల్లో పాల్గొన నివ్వకుండా, అడ్డుకున్న పోలీసులతో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ వాగ్వాదానికి దిగారు. రోడ్డుపై బైఠాయించి ఎమ్మెల్యే కోవ లక్ష్మి, బాల్క సుమన్ నిరసన తెలిపారు. బీజేపీ మద్దతుతో కాగజ్‌నగర్ మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకున్నది. మున్సిపాలిటీ చైర్మన్‌గా కాంగ్రెస్ కౌన్సిలర్ షాహీన్ సుల్తానా ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్‌గా బీజేపీ కౌన్సిలర్ గజ్జల లావణ్య ఎన్నికున్నారు.


.webp)



