Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...అన్నింటికీ నేనే మాట్లాడితే మీరెందుకు...పార్టీ నేతలపై పవన్ ఆగ్రహం
posted on: Feb 2, 2026 8:52PM
.webp)
జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జనసేన పార్టీ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరి సీకే కన్వెన్షన్‌లో నిర్వహించిన జనసేన పార్టీ జనరల్ బాడీ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమల కల్తీ లడ్డూ వ్యవహారంపై వైసీపీ విమర్శలకు ఎందుకు కౌంటర్ ఇవ్వటం లేదని డిప్యూటీ పవన్ కల్యాణ్ అసహనం వ్యక్తం చేశారు. అన్నిటికీ నేనే మాట్లాడితే మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నది ఎందుకని సీరియస్ అయ్యారు.
వైసీపీ నాయకుల దుష్ప్రచారంపై మీరు మాట్లాడాలి కదా అని జనసైనికులను డిప్యూటీ సీఎం నిలదీశారు. మహిళల విషయంలో పార్టీ నేతలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. వైసీపీ నాయకుల ట్రాప్‌లో పడొద్దన్నారు. మీపై, మీ ఫ్యామిలీపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు.. జాగ్రత్త! జనసేన నేతలు మాత్రం సిద్ధాంతపరంగా, సబ్జెక్ట్ పరంగానే మాట్లాడాలి. విమర్శలకు విషయంతోనే సమాధానం చెబుదామని పవన్ పిలుపునిచ్చారు.



.webp)


