Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...'పెద్దలు జానారెడ్డి' వారికి ఇది తగునా?
posted on: Aug 28, 2016 2:43PM

కొందరు మేధావులు అమాయకుల్లా కనిపిస్తారు! కొందరు అమాయకులు మేదావుల్లా అనిపిస్తారు! ఈ స్టేట్మెంట్ కాంగ్రెస్ సీనియర్ నేత జానా రెడ్డిని చూడగానే ఎవరికైనా గుర్తుకు వస్తుంది! ఇంతకీ, జానా రెడ్డి మేధావా? అమాయకుడా? ఆ వివాదాస్పద సమాధానం ఇపపుడెందుకుగాని... మనం విషయంలోకి వెళదాం...
జానా రెడ్డి ప్రస్తుతం సీఎల్పీ నేత. అసెంబ్లీలో కాంగ్రెస్ కి ఆయనే పెద్ద దిక్కు. ఆయన సుదీర్ఘ కెరీర్లో పోషించని పాత్ర లేదు. చేపట్టని పదవీ లేదు. అందుకే, ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా '' పెద్దలు జానారెడ్డి '' అంటూ వినయంగా సంబోధిస్తారు! నిజంగా కూడా ఆయన స్టేచర్ అలాంటిది! అయితే, అప్పుడప్పుడు మన పెద్దలు జానారెడ్డిగారు ఇచ్చే స్టేట్మెంట్సే టీ కాంగ్రెస్ నాయకులకి దిమ్మ తిరిగిపోయేలా చేస్తున్నాయి...మహారాష్ట్రతో చారిత్రక జల ఒప్పందాల విషయంలో ఇటు టీఆర్ఎస్ కు, అటు కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి తీవ్రమైన విమర్శలు, ప్రతి విమర్శలే నడిచాయి. అయితే, ఈ స్టేట్మెంట్ల పరంపరలో జానా రెడ్డి హఠాత్తుగా బాంబు పేల్చారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినట్లు కాంగ్రెస్ హయాంలో ఒప్పందం జరగలేదని, కేవలం ప్రతిపాదనలు మాత్రమే చోటు చేసుకున్నాయని అన్నారు! స్వయంగా జానా రెడ్డే ఇలా చెప్పటంతో టీ కాంగ్రెస్ టీఆర్ ఎస్ ముందు నోరు మూసుకుని కూర్చోవాల్సి వచ్చింది! అయితే, జానా రెడ్డి చెప్పింది మాత్రం నిజమే కావటం ఇక్కడ గమనార్హం!
సరే... మహారాష్ట్రతో ఒప్పందాల విషయంలో ఉత్తమ్ కుమార్ తొందరపడ్డారని భావించినా జానా మరో విషయంలోనూ టీ కాంగ్రెస్ ను ఇరుకున పెట్టారు! నయీమ్ ఎన్ కౌంటర్ విషయంలో కేసీఆర్ గులాబి దళాన్ని ఎలాగో కార్నర్ చేయాలని చూస్తోన్న కాంగ్రెస్ కు జానాయే షాకిచ్చారు! నయీమ్ ఎన్ కౌంటర్ సూపర్ అని అధికార పక్షానికి జానా కితాబునిచ్చారు! అటు పింక్ పార్టీ మాత్రం హస్తం పార్టీయే నయీమ్ ను పెంచిపోషించిందని ఆరోపిస్తోంది! అయినా కూడా జానా ఆ పార్టీకే క్రెడిట్ ఇవ్వటం నిజంగా పెద్ద షాకే!
జానా తన స్వంత పార్టీకి ఇచ్చిన మరో షాక్ కూడా వుంది! కృష్ణ పుష్కరాల విషయంలో అక్రమాలు జరిగాయని, అవినీతని, మరోటని, ఇంకోటని... టీ కాంగ్రెస్ కొంచెం గొంతు సవరించుకునే సరికే జానా వారు మైండ్స్ బ్లాంక్ చేసేశారు! పుష్కర స్నానం చేసి.. ఏ మాత్రం అబద్ధం ఆడకుండా ఏర్పాట్లు భేష్ అంటూ మెచ్చుకున్నారు! నిజంగా అధికార పక్షం మంచి చేస్తే జానా లాంటి సీనియర్ మెచ్చుకోవటంలో తప్పు లేదు. కాని, తనకి ఎన్నో పదవులు ఇచ్చి ఇంత దాకా తెచ్చిన కాంగ్రెస్ పార్టీకి నష్టం వచ్చేలా వ్యాఖ్యలు చేయటం... ఏమో ''పెద్దలు జానారెడ్డి''గారే ఉచితానుచితాలు ఆలోచించుకోవాలి!



.jpg)


