పీవోకే సహా మొత్తం కాశ్మీర్ భారత్ లో అంతర్భాగమే!
posted on: Feb 7, 2026 11:46AM

పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్(పీవోకే) సహా మొత్తం జమ్మూ కాశ్మీర్ భారత్ లో అంతర్భాగమే అని అమెరికా చాటింది. ఇంత వరకూ భారత్ చెబుతున్న వాదనకు పూర్తి మద్దతు ఇస్తూ అమెరికా ఆ మేరకు ఓ మ్యాప్ విడుదల చేసింది. దీంతో పాకిస్థాన్ కు అగ్రరాజ్యం గట్టి షాక్ ఇచ్చినట్లైంది. విషయమేంటంటే భారత్ - అమెరికా ట్రేడ్ డీల్ కుదిరిన నేపథ్యంలో అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్ కార్యాలయం తాజాగా ఓ మ్యాప్ ను విడుదల చేసింది. ఆ మ్యాప్ లో పాక్ ఆక్రమిత కాశ్మీర్ సహా మొత్తం జమ్మూ కాశ్మీర్ భారత్ భూభాగమేనని స్పష్టంగా చూపింది. ఈ చర్య ద్వారా భారత్ చెబుతున్నట్లుగా పీవోకే సహా కాశ్మీర్ మొత్తం ఇండియాలో అంతర్భాగమని అమెరికా అంగీకరించినట్లైంది.
భారత్, అమెరికా వాణిజ్య ఒప్పంద ఫ్రేమ్‌వర్క్‌కు సంబంధించిన ఒక గ్రాఫిక్‌లో భాగంగా ఈ మ్యాప్‌ను విడుదల చేసిన అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్ కార్యాలయం పాకిస్థాన్ వాదనను పూర్వపక్షం చేసింది. ఒక వైపు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ వంటి వారు వాషింగ్టన్‌లో తమకు అనుకూలంగా లాబీయింగ్ చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం పాకిస్థాన్ కు దౌత్యపరంగా గట్టి ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. అలాగే మోడీ సర్కార్ సాధించిన అతి పెద్ద దౌత్య విజయంగా దీనిని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణుులు అభివర్ణి స్తున్నారు.






