Latest News
జమ్మూ కాశ్మీరులో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకి మార్గం సుగమం?
posted on: Dec 26, 2014 9:59AM
.jpg)
జమ్మూ, కాశ్మీర్ రాష్ట్రంలో మూడు ప్రధాన రాజకీయ పార్టీలు-బీజేపీ, పీపుల్స్ డెమోక్రిటిక్ పార్టీ మరియు నేషనల్ కాన్ఫరెన్స్ ల మధ్య జరుగుతున్న చర్చలు కీలక దశకు చేరుకొన్నాయి. ఎన్నికలలో ఓడిపోయిన అధికార నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు మరియు మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తాము ప్రతిపక్షంలో కూర్చొంటామని మొదట అన్నప్పటికీ, తమ పార్టీకి ఉపముఖ్యమంత్రి పదవి, ఒక కేంద్ర మంత్రి పదవి, రాజ్యసభలో ఒక సీటు ఇచ్చేమాటయితే బీజేపీకి మద్దతు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నట్లు సమాచారం. నిన్న లండన్ వెళ్ళవలసిన ఆయన ఇందుకోసం తన పర్యటనను రద్దు చేసుకొని కాశ్మీర్ లో మకాం వేసిన కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీతో నిన్న సమావేశమయినట్లు వార్తలు వచ్చేయి. కానీ బీజేపీ ఆ వార్తలను ఖండించింది. అయితే తమకంటే బలమయిన పీపుల్స్ డెమోక్రిటిక్ పార్టీకి మద్దతు ఇచ్చి దానికి అధికారం కట్టబెట్టడం కంటే, తమకంటే బలహీనంగా ఉన్న నేషనల్ కాన్ఫరెన్స్ మద్దతు తీసుకొని తామే అధికారం చెప్పట్టడం మంచిదనే ఆలోచనలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది. అందువలన నేషనల్ కాన్ఫరెన్స్ మద్దతు తీసుకొని బీజేపీ జమ్మూ, కాశ్మీర్ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి. అయినప్పటికీ బీజేపీ నేతలు ఒకవైపు ఒమర్ అబ్దుల్లాతో చర్చలు జరుపుతూనే మరోవైపు పీపుల్స్ డెమోక్రిటిక్ పార్టీతో కూడా చర్చలు జరుపుతుండటం చాలా ఆసక్తికరంగా ఉంది. ఈరోజు సాయంత్రం లేదా రేపటిలోగా అక్కడ ఏ పార్టీ దేనితో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందో తేలిపోవచ్చును.


.jpg)
.jpg)


