Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...బ్రిటీష్ అధికారుల అనినీతే ఈ వార్తాపత్రిక లక్ష్యం.. 246 ఏళ్ల కిందట దీని ప్రభంజనం తెలుసా?
posted on: Feb 7, 2026 6:07PM

స్వాతంత్య్రానికి పూర్వం బ్రిటీషు పాలనలో భారతీయుల పరిస్థితి ఎంతో ధీనంగా ఉండేది. భారత పౌరులు అందరూ బ్రిటీషర్లకు బానిసలుగా మారారు. కానీ భారతదేశంలో ఎందరో వీరులు ఈ బానిసత్వం నుండి దేశానికి విముక్తి కలిగించాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. 246 ఏళ్ల క్రితం భారతదేశంలో బ్రిటీషర్ల అవినీతిని, వారి తప్పులను ధైర్యంగా బహిర్గతం చేసి, ప్రజలకు అందించిన వార్తాపత్రిక ఒకటుంది. నిజానికి ఈ వార్తాపత్రిక భారతదేశంలో స్వతంత్ర జర్నలిజానికి పునాది వేసింది. ఆ వార్తా పత్రిక పేరే హిక్కీస్ బెంగాల్ గెజిల్. దీన్ని హికీ గెజిట్ అని, బెంగాల్ గెజిట్ లేదా కలకత్తా జనరల్ అడ్వర్డైజర్ అని వివిధ పేర్లతో పిలిచారు. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే..
జనవరి 29, 1780..
భారతదేశంలో అధికారిక జర్నలిజం యుగం జనవరి 29, 1780న ప్రారంభమైంది. జేమ్స్ అగస్టస్ హికీ అనే వ్యక్తి కలకత్తాలో దేశంలోని మొట్టమొదటి వార్తాపత్రికను ప్రచురించడం ప్రారంభించాడు. ఇది "హికీ గెజిట్", "బెంగాల్ గెజిట్" లేదా "కలకత్తా జనరల్ అడ్వర్టైజర్" అని వివిధ పేర్లతో పిలువబడింది. సమాచారంపై అధికారంలో ఉన్నవారు గుత్తాధిపత్యం వహించిన కాలం అది. అటువంటి క్లిష్ట సమయాల్లో హిక్కీ రెండు పేజీల వార్తాపత్రికను ప్రచురించడం ద్వారా కమ్యూనికేషన్ల ప్రపంచంలో విప్లవాత్మక మార్పులు చేశాడు.
న్యాయం, ధైర్యం..
హికీ ఈ వార్తాపత్రికను సమాచార వనరుగా మాత్రమే కాకుండా స్వతంత్ర వేదికగా కూడా స్థాపించారని చెబుతారు. ఆయన వార్తాపత్రిక అత్యంత గొప్ప లక్షణం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఉన్నత స్థాయి అధికారులపై తిరుగులేని విమర్శలు చేయడం. ఆయన పరిపాలనలోని లోపాలను ప్రజలకు బహిర్గతం చేసి, సమాజానికి, ప్రభుత్వానికి మధ్య బలమైన వారధిగా పనిచేశారు. ఆయన నిర్భయంగా మొదలు పెట్టిన ఈ జర్నలిజం భారతదేశంలో పత్రికా స్వేచ్ఛకు పునాది వేసింది.
అణచివేత..
హిక్కీ నిష్పాక్షికంగా విమర్శించే వైఖరి ఈస్ట్ ఇండియా కంపెనీకి నచ్చలేదు. దీని వలన హిక్కీ ఈస్ట్ ఇండియా కంపెనీ వారి ఆగ్రహానికి గురయ్యాడు. అతనికి భారీ జరిమానా విధించి, జైలు శిక్ష కూడా విధించారు.
కేవలం రెండేళ్లే..
ప్రభుత్వ ఒత్తిడి, అణచివేత విధానాల కారణంగా, ఆ వార్తాపత్రిక కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే కొనసాగింది. చివరికి 1782లో, హికీ ప్రింటింగ్ ప్రెస్ జప్తు చేశారు. ఈ చారిత్రాత్మక వార్తాపత్రిక ప్రచురణను శాశ్వతంగా నిలిపివేశారు.
చెరగని ముద్ర..
వార్తాపత్రిక కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే ఉనికిలో ఉన్నప్పటికీ, అది భారత చరిత్రపై చెరగని ముద్ర వేసింది. ఈ వార్తాపత్రిక యొక్క అసలు కాపీలు ఇప్పటికీ లండన్‌లోని బ్రిటిష్ లైబ్రరీలో, భారతదేశంలోని ఎంపిక చేసిన ఆర్కైవ్‌లలో భద్రపరిచారు. ఇదీ భారతదేశంలో ప్రారంభించిన మొదటి వార్తాపత్రిక ప్రభంజనం.
*రూపశ్రీ.






