పుస్తకం రాస్తున్న జైపాల్ రెడ్డి

posted on: Nov 11, 2014 4:57PM

 

తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు కోసం తెర వెనుక కృషిచేసిన అనేక మందిలో మాజీ కేంద్రమంత్రి ఎస్.జైపాల్ రెడ్డి కూడా ఒకరు. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ అధిష్టానం అంగీకరించినప్పటి నుండి పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందే వరకు కూడా కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో అనేక నాటకీయమయిన సంఘటనలు జరిగిన సంగతి ప్రజలందరూ స్వయంగా చూసారు. ముఖ్యంగా బద్ధ శత్రువులయిన కాంగ్రెస్, బీజేపీలు పార్లమెంటు సాక్షిగా ఆడిన రాజకీయ చదరంగం చూసిన ప్రజలు అసలు బిల్లు ఆమోదం పొందుతుందా లేదా అని ఆఖరి నిమిషం వరకు ఉప్పిరి బిగపట్టి చూశారు.

 

కాంగ్రెస్, బీజేపీల మధ్య ఎటువంటి అవగాహన కుదిరింది? ముందు బెట్టు చేసిన బీజేపీ ఆఖరు నిమిషంలో మనసు మార్చుకొని బిల్లుకు ఎందుకు మద్దతు ఇచ్చింది? దాని వెనుక సూత్రదారులు, పాత్రదారులు ఎవరెవరున్నారు? ఆంద్ర యంపీలు, కేంద్రమంత్రుల అసలు రూపాలు ఏమిటి? వంటి అనేక ప్రశ్నలు విభజన తరువాత పూర్తిగా మరుగున పడిపోయాయి. ఇప్పుడు కేంద్రంలో, రెండు రాష్ట్రాలలో కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడంతో పుస్తక ప్రియుడయిన జైపాల్ రెడ్డి మళ్ళీ పుస్తక పటనంతో కాలక్షేపం చేస్తున్నారు. ఆయన సన్నిహితుల కోరిక మేరకు జైపాల్ రెడ్డి విభజన బిల్లు ఆమోదం కోసం తెర వెనుక జరిగిన కధని ప్రజల కోసం అక్షరబద్ధం చేస్తున్నట్లు తెలిపారు. అయితే కొన్ని కారణాల వలన ఆ పుస్తకాన్ని వచ్చే ఏడాది విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. అది విడుదల అయితే ఎన్ని సంచలన విషయాలు బయటపడుతాయో..ఎంతమంది భాగోతాలు బయటపడుతాయో..

google-ad-img
    Related Sigment News
    • Loading...