50 మంది చిన్నారులకు సైకిళ్లు పంపిణీ చేసిన జగ్గారెడ్డి

posted on: May 11, 2026 3:28PM

 

సంగారెడ్డి పట్టణంలో సోమవారం ఆనంద క్షణాలు కనిపించాయి. చిన్నారుల చదువు, ఆరోగ్యం, ఉత్సాహాన్ని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి 50 మంది పిల్లలకు సైకిళ్లు అందజేశారు. సైకిల్ అందుకున్న ప్రతి చిన్నారి ముఖంలో కనిపించిన ఆనందం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా పిల్లలతో ముచ్చటించిన ఆయన, వేసవి సెలవుల్లో ఆరోగ్యం కాపాడుకోవాలని సూచించారు. “ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో సైకిల్ తొక్కవద్దు… నీళ్లు ఎక్కువగా తాగండి, జాగ్రత్తగా ఉండండి” అని ప్రేమగా చెప్పి వారిని అప్రమత్తం చేశారు.

 

 

తమ కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకున్న చిన్నారులకు విడతల వారీగా సైకిళ్ల పంపిణీ కొనసాగుతుందని తెలిపారు. ఇప్పటివరకు 320 సైకిళ్లు అందించామని, త్వరలో మరో 600 సైకిళ్లు పంపిణీ చేయడానికి ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జార్జ్, చిద్రుప్ప రఘు గౌడ్, కూన సంతోష్, కిరణ్ గౌడ్, మహేష్ ముదిరాజ్, శ్రీకాంత్ గౌడ్, సుదీప్ తదితరులు పాల్గొన్నారు.

 

google-ad-img
    Related Sigment News
    • Loading...