Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పెట్టుబడిదారులను తరిమేసేందుకే జగన్ మావిగన్!
posted on: Apr 13, 2026 3:05PM
.webp)
ప్రస్తతుం ఆంధ్రప్రదేశ్ లో జగన్ మావిగన్ పై ఎడతెగని చర్చ జరుగుతోంది. వైసీపీయూలు మావిగన్ ను ఆంధ్రప్రదేశ్ ను సకల కష్టాల నుంచీ తొలగించే సంజీవనిలా, సర్వరోగ నివారిణి జిందా తిలిస్మాత్ లా అభివర్ణిస్తుంటే.. తెలుగుదేశం కూటమి పార్టీలే కాకుండా, మేధావులూ, సామాన్య జనం కూడా మావిగన్ ప్రతిపాదన చేసిన జగన్ ను ఓ జోకర్ గా అభివర్ణిస్తున్నారు. అదే తీరుగా నెటిజన్లు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు.
అయితే ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు మాత్రం జగన్ మావిగన్ ప్రతిపాదన ఆషామాషీగా చేయలేదని హెచ్చరిస్తున్నారు. ఆ ప్రతిపాదన వెనుక భారీ కుట్ర దాగుందని చెబుతున్నారు. ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారాయి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మావిగన్’ వెనుక లోతైన రాజకీయ వ్యూహం ఉందంటున్నారాయన. ఆ వ్యూహం అమరావతి విధ్వంసమేనని నొక్కి వక్కాణిస్తున్నారు. విజయవాడ మీడియాతో మాట్లాడిన ఏబీ వెంకటేశ్వరరావు జగన్ మావిగన్ ప్రతిపాదన కేవలం చంద్రబాబుపై విమర్శకే పరిమితం కాదన్నారాయణ. ఈ మావిగన్ ప్రతిపాదన వెనుక అమరావతి అస్థిత్వాన్నే ప్రశ్నార్థకం చేసే అతి బయంకరమైన కుట్ర కోణం ఉందని ఏబీ వెంకటేశ్వరరావు వివరించారు. జగన్ మావిగన్ వ్యూహం అమరావతి అభివృద్ధిని అడ్డుకోవడానికి ఉద్దేశించినదేనని విశ్లేషించారు.
ముఖ్యంగా పెట్టబడి దారులను బెదరించి వెనక్కు పంపడం కోసమే ఆయన మావిగన్ ప్రతిపాదన చేశారన్న ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో అమరావతికి వస్తున్న పెట్టుబ డిదారులను భయభ్రాంతులకు గురిచేయడమే జగన్ లక్ష్యం అన్నారు. రాజధానిపై జగన్ తన వ్యతిరేకతను ఈ విధంగా వ్యక్తం చేస్తూ, భవిష్యత్తులో అక్కడ ఎలాంటి అభివృద్ధి జరగకుండా అడ్డుకట్ట వేయాలన్న కుట్ర చేస్తున్నారన్నారు.
సపోజ్ ఫర్ సపోజ్ జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే అమరావతి పరిస్థితి దారుణంగా మారుతుందని ఏబీ వెంకటేశ్వరరావు హెచ్చరించారు. ఇప్పటికే ఉన్న మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయడం, వేసిన రోడ్లను తవ్వేయడం, కేబుళ్లు, పైపులను తరలించడం వంటి చర్యలకు పాల్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో కూడా అమరావతిని గ్రాఫిక్స్ అని, స్మశానమని అభివర్ణించి పెట్టుబడిదారులు రాకుండా అడ్డుకున్నారని గుర్తు చేసిన ఏబీ వెంకటేశ్వరరావు.. ఇప్పుడూ అదే చేస్తున్నారన్నారు.
కేంద్ర ప్రభుత్వం కూడా అమరావతి విషయంలో పూర్తిస్థాయి నిబద్ధతతో లేదని విమర్శించిన ఏబీవీ.. ఢిల్లీ పాలకులు కేవలం తమ రాజకీయ అవసరాల కోసమే నిర్ణయాలు తీసుకుంటున్నారనీ, రైతుల త్యాగాలకు తగిన న్యాయం జరగడం లేదనీ చెప్పారు. సీఆర్డీఏ చట్టం ఉండటం వల్లనే ఇప్పటివరకు అమరావతి కొంతైనా నిలబడిందని చెప్పిన ఏబీవీ.. ఈ చట్టాన్ని మరింత బలోపేతం చేయాలన్నారు. ప్రస్తుత ప్రభుత్వం రాజధాని పనులను 2028 నాటికి పూర్తి చేస్తామని చెబుతున్న నేపథ్యంలో, ఆ దిశగా వేగంగా అడుగులు వేయాలని కోరారు. అమరావతి కేవలం నగరం కాదనీ, వేలాది మంది రైతుల నమ్మకమని అన్నారు.






