Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...సీదిరి అప్పలరాజుతో జగన్ ములాఖత్ రద్దు..!
posted on: Jul 30, 2026 5:29PM
.webp)
విధుల్లో ఉన్న మహిళా ఎస్సైపై వైసీపీ నేతలు దురుసు ప్రవర్తన..!
వైసీపీ అధినేత జగన్ శ్రీకాకుళం పర్యటన సందర్బంగా ఆ పార్టీ నాయకులు శ్రుతిమించి ప్రవర్తించారు. విధుల్లో ఉన్న ఒక మహిళా పోలీస్ అధికారి పట్ల సదరు పార్టీ నేతలు అత్యంత దురుసుగా వ్యవహరించడం తీవ్ర కలకలం రేపింది.
శ్రీకాకుళం నగర పరిధిలోని కొత్తరోడ్డు కూడలి వద్ద ఈ చేదు సంఘటన చోటుచేసుకుంది. జగన్ రాక సందర్భంగా అక్కడ శాంతిభద్రతల పరిరక్షణ కోసం బూర్జ పోలీస్ స్టేషన్‌కు చెందిన మహిళా ఎస్సై ప్రవళ్లిక బందోబస్తు విధుల్లో పాల్గొన్నారు.
ఆ సమయంలో ఆమదాలవలస నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జ్ చింతాడ రవికుమార్ తన అనుచరులతో కలిసి తీవ్ర తోపులాటకు దిగారు. భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న ఎస్సై ప్రవళ్లికను ఆయనతో పాటు మరికొందరు వైసీపీ నాయకులు బలంగా పక్కకు నెట్టివేసినట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారు.
చట్టాన్ని పరిరక్షించే యూనిఫాంలో ఉన్న మహిళా అధికారినని కూడా చూడకుండా నాయకులు ప్రదర్శించిన ఈ రకమైన ప్రవర్తన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు రిమాండ్ ఖైదీగా ఉన్న నేపథ్యంలో ఆయనను పరామర్శించేందుకు వైఎస్ జగన్ ఈ శ్రీకాకుళం పర్యటనను చేపట్టారు. పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.
అయితే, బాధ్యతాయుతమైన అధికారిక విధుల్లో ఉన్న మహిళా ఎస్సైపై వైసీపీ నేతలు ఇలా దౌర్జన్యానికి దిగడం పట్ల ప్రజాసంఘాలు, మహిళా మండళ్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటూ రౌడీయిజం చేయడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.
ఈ ఘటనపై విధులకు విఘాతం కలిగించిన వైసీపీ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. శాంతిభద్రతల ఉల్లంఘనకు పాల్పడిన వారిపై చట్టపరంగా కేసులు నమోదు చేసేందుకు చర్యలు వేగవంతం చేశారు.
శాంతిభద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న మహిళా అధికారులపై ఇటువంటి దుశ్చర్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని సిక్కోలు వాసులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు సీదిరి అప్పలరాజుతో జగన్ ములాఖత్ రద్దు అయింది. జైలు నిబంధనల మేరకు 5 గంటల వరకే అనుమతిస్తారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ బొత్స, పలువురు వైసీపీ నేతలు లాయర్లు జైలులోకి వెళ్లి సీదరిని పరామర్శించి బయటకు వచ్చారు.
Jaganmeeting with Seediri Appalaraju cancelled, Srikakulam tour, SI Paravallik, YSRCP,
MLC Botsa, Chintada Ravikumar, Seediri Appalaraju






