Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...జగన్ లో ఈడీ విచారణ వణుకు.. మోదీ, అమిత్ షా అప్పాయింట్ మెంట్ కోసం ఎదురు చూపు?
posted on: Jul 22, 2026 9:41AM

వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ కేంద్రం శరణు జొచ్చారా? ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో ఈడీ విచారణ.. వేగం జగన్ ను భయపెడుతున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ సడన్ ఢిల్లీ పర్యటన వెనుక రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, ముఖ్యంగా ఈడీ ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ వాసుదేవరెడ్డి, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్ లను అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్న నేపథ్యంలో..జగన్ జంకుతున్నట్లు చెబుతున్నారు. ఈ కేసు విచారణలో భాగంగా తనను కూడా ప్రశ్నించడమో, అరెస్టు చేయడమో ఖాయమన్న నిర్ధారణకు వచ్చిన జగన్ ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను శరణువేడాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. అందుకే జగన్ ఢిల్లీ పర్యటనకు సిద్ధమవుతున్నట్లు రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాల అప్పాయింట్ మెంట్ కోసం.. లోక్‌సభ లో వైసీపీ పక్ష నేత మిథున్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి ద్వారా ప్రధాని, హోంమంత్రులతో అప్పాయింట్ మెంట్ కోసం ఇప్పటికే పీఎంవోకే, కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు విజ్ఞప్తులు పంపినట్లు సమాచారం. వారి అప్పాయింట్ మెంట్ దొరకడమే ఆలస్యం జగన్ హస్తినకు పయనం అవుతారని విశ్వసనీయంగా తెలుస్తోంది.
మద్యం కుంభకోణంలో ఈడీ విచారణ.. ప్రధాన లబ్ధిదారుడికి చేరువ అవుతోందనీ, ఈ నేపథ్యంలోనే జగన్ పేరు ప్రచారంలోకి వచ్చిందని అంటున్నారు. మద్యం కుంభకోణం కేసులో ఈడీ తనకు నోటీసులు పంపే అవకాశం ఉందన్న సమాచారంతోనే మోడీ, అమిత్ షాల అప్పాయింట్ మెంట్ కోసం జగన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతుండటంతో.. మోడీ, అమిత్ షా అందుబాటులో ఉండటంతో.. పార్లమెంట్ ప్రాంగణంలోనే జగన్ వారిని కలిసేందుకు అవవకాశం కల్పించాలని ఇప్పటికే వైసీపీ ఎంపీలు మిథున్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలు కేంద్ర పెద్దలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఢిల్లీ వర్గాల భోగట్టా.
రాష్ట్రంలో మద్యం అక్రమ వ్యవహారానికి సంబంధించి ఈడీ దూకుడు గత కొద్ది రోజులుగా వైసీపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. వైసీపీ హయాంలో నిర్ణయాలు తీసుకున్న అధికారులు, రాజకీయ నాయకులకు ఈడీ ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో అరెస్టయిన కీలక వ్యక్తుల నుంచి లభించిన సమాచారం ఆధారంగా అగ్రనేతల పేర్లు వెలుగులోకి వస్తుండటం.. త్వరలోనే విచారణకు హాజరు కావలసిందిగా జగన్ కు ఈడీ నోటీసులు జారీ చేసే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం జోరుగా సాగుతుండటంతో.. జగన్ కేంద్రం పెద్దలను ఆశ్రయించాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే..ఇప్పటి వరకూ మోడీ, అమిత్ షా అప్పాయింట్ మెంట్ లభించకపోవడంతో జగన్ హస్తిన పర్యటన తేదీ ఖరారు కాలేదని తెలుస్తోంది. అయితే వైసీపీ వర్గాల సమాచారం మేరకు గురువారం(జులై23) జగ్ హస్తినకు చేరుకుంటారనీ, అమిత్ షా అప్పాయింట్ మెంట్ లభించిందనీ తెలుస్తోంది.
Jittery over ED probe, YS Jagan Delhi Visit, PM Narendra Modi, Amit Shah Appointment, ED Investigation Liquor Case, YSRCP Political News


.webp)



