ఓవర్ కాన్ఫిడెన్స్ ఓడించింది: జగన్‌కి జ్ఞానోదయం
posted on: Jun 23, 2014 4:15PM
.jpg)
వైసీపీ నాయకుడు జగన్‌కి జ్ఞానోదయం కలిగింది. ఎన్నికలలో ఓడిపోయి ఇంతకాలం అయిన తర్వాత ఆయనకి తన పార్టీ ఈ ఎన్నికలలో ఎందుకు ఓడిపోయిందో అర్థమైంది. ఆ విషయాన్ని ఆయన అసెంబ్లీలో చెప్పారు. వైసీపీ గెలవటం ఖాయం, తాను ముఖ్యమంత్రి అయిపోవడం ఖాయమని జగన్ కలలు కన్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఆ కలలన్నీ కల్లలని తేలిపోయింది. ఈ విషయాన్నే జగన్ అసెంబ్లీలో ప్రస్తావిస్తూ, ‘‘తెలుగుదేశం పార్టీ రుణమాఫీ హామీ కారణంగా, మోడీ హవా కారణంగా విజయం సాధించింది. మేం తప్పకుండా గెలుస్తామన్న అతి విశ్వాసంలో మేం వున్నాం. ఆ అతి విశ్వాసమే మా పార్టీని ఓడించింది’’ అని జగన్ చెప్పారు. మొన్నటి ఎన్నికలలో ప్రధాన పోటీ తెలుగుదేశం, వైసీపీ మధ్యలో వుందని, ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోయిందని ఆయన అందరికీ తెలిసిన విషయాన్నే మరోసారి చెప్పారు. అలాగే ప్రతిపక్షం అంటే ప్రభుత్వం చేసే ప్రతి పనినీ విమర్శించడం కాదని అన్నారు. మరి ఆయన మాత్రం తెలుగుదేశం ప్రభుత్వాన్ని అప్పుడే అన్నిటికీ విమర్శించడం మొదలెట్టేశారు.




(1).jpg)

.webp)



